వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత దిగజారారా?: ఆంధ్రజ్యోతిపై వైసిపి ఈశ్వరి, కొత్తపల్లి గీతపై పోరాటమని..

ఆంధ్రజ్యోతి పత్రికపై, ఏబీఎన్ ఛానల్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా ఆంధ్రజ్యోతి తప్పుడ కథనాలు రాసిందని విమర్శించా

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రజ్యోతి పత్రికపై, ఏబీఎన్ ఛానల్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా ఆంధ్రజ్యోతి తప్పుడ కథనాలు రాసిందని విమర్శించారు.

చంద్రబాబు అసహనం, జగన్‌కు 2 కారణాలు: అఖిలప్రియ ట్విస్ట్చంద్రబాబు అసహనం, జగన్‌కు 2 కారణాలు: అఖిలప్రియ ట్విస్ట్

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తమ పార్టీ నాయకులను, నేతలను జగన్ పరిచయం చేయించి, ఫోటోలు తీయించారని అన్నారు. కానీ విలువలు దిగజార్చేలా ఆంధ్రజ్యోతి వార్తలు రాసిందన్నారు.

Giddi Eswari blames Andhra Jyothi

మీ రాతలు వెనక్కి తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తామని ఈశ్వరి హెచ్చరించారు. అవాస్తవ వార్తలు రాసి గిరిజనులను, దళితులను కించపరచవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

జవహర్ వ్యాఖ్యలపై ఆగ్రహం

బీరు హెల్త్ డ్రింక్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందని, హాస్యాస్పదంగా ఉందని గిడ్డి ఈశ్వరి అన్నారు. దానిని మెడికల్ షాపుల్లో ఏమైనా అమ్మదలుచుకున్నారా అని నిలదీశారు. ఆసుపత్రుల్లో రోగులకు ఇస్తారా అన్నారు.

ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన మంత్రి జవహర్ బీర్ హెల్త్ డ్రింక్ అని మాట్లాడటం దారుణం అన్నారు. గిరిజన ప్రాంతాల్లో విష జ్వరాలు వ్యాపించి మృత్యువాత పడితే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.

వైసిపి గుర్తుపై గెలిచి ప్రలోభాలకు తలొగ్గి, పార్టీ ఫిరాయించిన ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదని తాను న్యాయ పోరాటం చేస్తానని గిడ్డి ఈశ్వరి చెప్పారు.

English summary
YSR Congress Party MLA Giddi Eswari fired at Andhra Jyothi daily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X