వీడియోపై గిడ్డి ఈశ్వరి తడబాటు: జవాబు దాటవేత
హైదరాబాద్: సాక్షి మీడియా బయటపెట్టిన వీడియోపై సమాధానం చెప్పే విషయంలో శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి తడబడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున శాసనసభకు గెలిచిన ఆమె ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
మంత్రి పదవి కోసమే పార్టీ మారాననే విషయాన్ని ఆమె పరోక్షంగా అంగీకరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వీడియోలో మాట్లాడింది మీరేనా అని అడిగితే సమాధానం దాటవేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వీడియోపై మీడియా ప్రతినిధులు శాసనసభ మీడియా పాయింట్ వద్ద ప్రశ్నలు అడుగుతుండగానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. పదవుల కోసమే పార్టీ మారారనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుల ఆరోపణలకు కూడా ఆమె జవాబు దాటవేశారు.
మంత్రి పదవి లేదా ఎస్టీ కార్పోరేషన్ పదవి ఇస్తామని ఆశపెట్టి ఈశ్వరిని టిడిపిలోకి తీసుకున్నట్లు తమకు లభించిన వీడియో బయటపెడుతోందని సాక్షి మీడియా రాసింది. డీల్ గురించి స్వయంగా ఈశ్వరి వెల్లడించారని, ఈ విషయంపై కార్యకర్తలతో మాట్లాడుతున్న వీడియో తమకు చిక్కిందని రాసింది.












Click it and Unblock the Notifications