వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: బర్త్ డే అని పిలిచి.. రేప్ చేసి, వీడియో తీశారు, రూ.10లక్షలు ఇవ్వాలంటూ..

|
Google Oneindia TeluguNews

కృష్ణా: జిల్లాలోని ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు గ్రామంలో దారుణం జరిగింది. బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సీనియర్‌ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడటంతోపాటు వీడియో తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017 ఫిబ్రవరి నెలలో ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిని తన తోటి విద్యార్థి వంశీకృష్ణ తన పుట్టిన రోజు పార్టీ ఇస్తానని చెప్పి మరో సీనియర్‌ శివారెడ్డితో కలిసి ఆగిరిపల్లిలోని ఓ గదికి తీసుకువెళ్లాడు. గదిలో ఎవరూ లేరేంటని యువతి ప్రశ్నించే లోపే వారిద్దరూ బలవంతంగా తలుపులు వేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక, వీడియో చిత్రీకరించారు.

 A girl allegedly raped by her friends

అనంతరం వీడియోను విద్యార్థినికి చూపించి ఇంటి వద్ద పెద్దలకు చెబితే దాన్ని బహిర్గతం చేస్తామని బెదిరించారు. దీంతో అప్పటినుంచి విద్యార్థిని మనోవేదనకు గురైంది. విద్యార్థిని ప్రవర్తనపై అనుమానం వచ్చిరావడంతో తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో 2018 మే నెలలో కళాశాల యాజమాన్యానికి జరిగిన ఉదంతంపై విద్యార్థిని తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విద్యార్థులను కళాశాల యాజమాన్యం మందలించి వదిలేసింది.

సమస్య సమసిపోయిందనుకుంటుండగా అత్యాచారం చేసిన విద్యార్థి స్నేహితుడు ప్రవీణ్‌ ఇటీవల ఫోన్ ద్వారా విద్యార్థినిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. తన వద్ద అత్యాచార వీడియో ఉందని రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకపోతే ఆ వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించాడు.

కాగా, ఇప్పటికే గ్రామంలోని మరికొందరి ఫోన్లకు కూడా ఈ వీడియోలు వెళ్లిన సంగతి యువతి తండ్రికి తెలియడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

English summary
A girl allegedly raped by her friends in agiripalli in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X