సీనియర్ల ర్యాగింగ్: కాలేజ్ వదిలేసి వెళ్లిన యువతి
శ్రీకాకుళం: జిల్లాలోని ఎచ్చెర్లలోని ఓ ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలో.. ఓ విద్యార్థిని సీనియర్ల వేధింపులు తాళలేక లేఖ రాసి వెళ్లిపోయింది. పోలీసులు ఆమె ఆచూకీని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు రోజుల క్రితం విద్యార్థిని తాను రోజు రాసే డైరీలో తాను వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోతున్నట్లు రాసింది.
ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. వారి ఫిర్యాదుతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. యువతి తణుకులో ఉన్న విషయం గుర్తించి, తీసుకు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. తనను వేధించిన సీనియర్ల పైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని ఆమె చెబుతున్నారు.

యువతులపై సామూహిక అత్యాచారం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జేజేపేటలో ముగ్గురు గిరిజన యువతులపై అత్యాచారం జరిగిందని తెలుస్తోంది. వారిని వైద్య పరీక్షలకు తరలించారు.
లారీ బోల్తా, ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు మలుపు వద్ద లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!