వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నయ్య మిత్రుడే, అన్నా పిలిచేది: చేతులూ కాళ్లూ కట్టేసి రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

మచిలీపట్నం: అన్నయ్యా అనే పిలిచే అమ్మాయిపై ఏ కీచకుడు దారుణానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా బందరు మండల పరిధిలో 16 ఏళ్ల వయస్సున్న ఓ బాలికపై దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పోలాటితిప్ప శివారులో తన తల్లి, తోడబుట్టిన వారితో కలిసి బాలిక నివాసం ఉంటోంది.

సోదరుని స్నేహితుడైన కాలేఖాన్‌పేటకు చెందిన రవి బాలిక కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండేవాడు. అన్నయ్యా అని పిలిచినా కూడా బాలికను కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి బయటకు వెళ్లగా అక్కడే ఉన్న రవి అత్యాచారం చేశాడు.

Girl raped by her brother's friend

ఇక్కడెందుకున్నవన్నయ్యా అంటే ఏమీ లేదంటూ వెనుదిరిగి వెళ్తున్నట్లు నటించాడు. ఆ తర్వాత అకస్తాత్తుగా అమ్మాయిని వెనక నుంచి వాటేసుకున్నాడు. ఆమె చేతులూ కాళ్లూ కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో బాధితురాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి కావడమే కాకుండా తీవ్ర మనో వేదనకు గురైంది.

విషయం తల్లి తల్లి బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఆ బాలిక నుంచి వివరాలు సేకరించిన తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A 16 year old girls has been raped near machilipatnam in Krishna district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X