వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతన్నే చేసుకుంటానంది, కానీ అతను మాట తప్పాడు: చివరికిలా ప్రాణాలే!..

|
Google Oneindia TeluguNews

అనంతపురం: వద్దన్నా వెంటపడ్డాడు. మతాలు వేరన్నా.. పెద్దలను ఎదిరించైనా పెళ్లి చేసుకుందామన్నాడు. చాలా రోజుల అంతర్మథనం తర్వాత అతని ప్రేమకు ఆమె ఓకె చెప్పింది.

తల్లిదండ్రులకు తెలిసి మందలించినా.. అతన్నే చేసుకుంటానని ఖరాఖండిగా చెప్పింది. కానీ, అంతలా నమ్మించిన ఆ యువకుడు మాత్రం.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తట్టుకోలేకపోయిన యువతి విషయం తాగి ఆత్మహత్య చేసుకుంది.

 ఎవరీ అమ్మాయి:

ఎవరీ అమ్మాయి:

బత్తలపల్లికి చెందిన దాదాఖలంధర్‌, ముంతాజ్‌బేగం దంపతుల చిన్న కుమార్తె నసురున్నీసా (25). స్థానిక ఆర్డీడీ ఆసుపత్రి ఆవరణలోని ఇళ్లల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో .స్థానిక ఎస్సీ కాలనీకీ చెందిన కుషాల్‌బాబు నసురున్నీషాకు పరిచయమయ్యాడు.

'అర్జెంట్.. ఒక్క కాల్ ప్లీజ్!': అర్థరాత్రి 1.30కి, టెక్కీకి బిగ్ షాక్..'అర్జెంట్.. ఒక్క కాల్ ప్లీజ్!': అర్థరాత్రి 1.30కి, టెక్కీకి బిగ్ షాక్..

 ప్రేమ పేరుతో:

ప్రేమ పేరుతో:

ఆర్డీడీ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఇళ్లలో పనిచేయడానికి నసురున్నీసా అక్కడికి రోజూ వచ్చి పోతుండేది. ఈ క్రమంలో కుషల్ బాబు ప్రేమ పేరుతో ఆమె వెంటపడ్డాడు. మన మతాలు వేరని ప్రేమకు అడ్డు చెప్పింది. మతాలు వేరైనా పరవాలేదంటూ అలాగే వెంటపడ్డాడు. కొద్దిరోజులకు నసురున్నీసా కూడా అతని ప్రేమను అంగీకరించింది.

ఏం జరిగింది?: టెక్కీ 'నందిని' ఆత్మహత్యపై అనుమానాలు.., ఏడుస్తూ తల్లికి చివరి ఫోన్ కాల్!ఏం జరిగింది?: టెక్కీ 'నందిని' ఆత్మహత్యపై అనుమానాలు.., ఏడుస్తూ తల్లికి చివరి ఫోన్ కాల్!

 మందలించిన తల్లిదండ్రులు:

మందలించిన తల్లిదండ్రులు:

నసురున్నీసా ప్రేమ వ్యవహారం గురించి తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆమెను మందలించారు. వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తామని చెప్పారు. నసురున్నీసా మాత్రమే అతన్నే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది.

వేరే యువతితో నిశ్చితార్థం:

వేరే యువతితో నిశ్చితార్థం:

ఓవైపు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని మరీ అతన్నే పెళ్లి చేసుకుంటానని నసురున్నీసా పట్టుబట్టగా.. మరోవైపు ఆమె ప్రియుడు కుషల్ బాబు ఆమెకు తెలియకుండా వేరే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. దీంతో షాక్ తిన్న యువతి స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. సోదరుడు ఇమ్రాన్ తో కలిసి వెళ్లి ఫిర్యాదు చేయడంతో.. తల్లిదండ్రులను తీసుకురావాలని పోలీసులు సూచించారు.

షం తాగి ఆత్మహత్య:

షం తాగి ఆత్మహత్య:

నసురున్నీసా సోదరుడు ఇమ్రాన్ తల్లిదండ్రులను తీసుకొచ్చేందుకు ఇంటికి వెళ్లగా.. ఆ సమయంలోనే ఆమె విషపు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆపై అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమె తమ్ముడికి ఫోన్ ద్వారా సమాచారం అందించి.. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. శుక్రవారం ఉదయం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

English summary
A Muslim girl committed suicide after his boyfriend engaged with another girl
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X