వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీతం యూనివర్సిటీ భవనాల కూల్చివేత.. భారీగా పోలీసుల మోహరింపు .. కారణం ఇదే !!

|
Google Oneindia TeluguNews

గీతం యూనివర్సిటీలో నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు . ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించాలంటూ గీతం విశ్వవిద్యాలయంలోని కట్టడాలను కూల్చడానికి రెవిన్యూ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. విశాఖ నగర శివారు రుషికొండ సమీపంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకున్న గీతం యూనివర్సిటీ నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకోవడం కోసం రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.

విశాఖలో విజయసాయి రెడ్డి డ్యాన్స్ కట్టిస్తా .. నేనేంటో జగన్ కు బాగా తెలుసు : సబ్బంహరివిశాఖలో విజయసాయి రెడ్డి డ్యాన్స్ కట్టిస్తా .. నేనేంటో జగన్ కు బాగా తెలుసు : సబ్బంహరి

 రోడ్స్ క్లోజ్ చేసి పోలీసులు మోహరించి మరీ కూల్చివేతలు

రోడ్స్ క్లోజ్ చేసి పోలీసులు మోహరించి మరీ కూల్చివేతలు

విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం ప్రహరీ గోడతో పాటు, కొంత భాగం సెక్యూరిటీ గదులను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు.
అయితే ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతకు పాల్పడుతోందని గీతం విద్యాసంస్థల యాజమాన్యం ఆరోపిస్తోంది. అసలు కూల్చివేతకు కారణం కూడా చెప్పలేదని గీతం యాజమాన్యం అంటోంది. గీతం యూనివర్సిటీకి వెళ్లి రోడ్లను బ్లాక్ చేసిన అధికారులు, భారీగా పోలీసులను మోహరించి మరీ కూల్చివేతలు దిగుతున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారుల వెర్షన్ వేరేలా ఉంది.

40 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉందంటున్న అధికారులు

40 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉందంటున్న అధికారులు

గీతం యూనివర్సిటీ ఆక్రమణలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆర్డిఓ పెంచల కిషోర్ తెలిపారు .దీనికి సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపామని, ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆక్రమణల తొలగింపు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఆక్రమణలో ఉన్న భవనాలను కూల్చివేస్తామని పేర్కొన్న ఆర్డిఓ, గత ఐదు నెలలుగా విశాఖలో ఆక్రమణలపై సర్వే చేపడుతున్నామని స్పష్టం చేశారు. కూల్చివేతపై యాజమాన్యానికి పూర్తి అవగాహన, సమాచారం రెండు ఉన్నాయని పేర్కొన్నారు.

తెల్లవారుజాము నుండే కూల్చివేతలు .. సమాచారం ఇవ్వకుండానే అంటూ ఆరోపణలు

తెల్లవారుజాము నుండే కూల్చివేతలు .. సమాచారం ఇవ్వకుండానే అంటూ ఆరోపణలు

కూల్చివేత సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు వర్సిటీ వద్దకు చేరుకున్నాయి. ఇక తెల్లవారుజాము నుండే కూల్చివేతలు కొనసాగుతున్నాయని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని గీతం యూనివర్సిటీ యాజమాన్య ఆరోపిస్తోంది. కనీసం లోపలికి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ,ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేయడం దురదృష్టకరమని గీతం యాజమాన్యం వ్యాఖ్యానిస్తోంది. న్యాయపరమైన అంశాలన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్తున్న గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వ ఇతర చర్యలకు దిగడం దారుణమని యాజమాన్యం అంటోంది.

Recommended Video

AP Colleges To Reopen From October 15 | Assistant Professors Recruitment : AP CM YS Jagan
గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమణలు

గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమణలు

గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎండాడ, రుషికొండ పరిసరాల్లోని భూములను ఆక్రమించుకుని గీతం విద్యా సంస్థలు ఆక్రమించుకున్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించినట్లుగా చెప్తున్నారు. అంతేకాదు గీతం పరిధిలో కోర్టు కేసులో ఉన్న భూములు ఏ గ్రామాల పరిధిలో ఉన్నాయి అన్న దానిపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు .ప్రస్తుతం గీతం యాజమాన్యం గుప్పిట్లో 40 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని గుర్తించిన రెవెన్యూ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు.

English summary
Greater Visakhapatnam Municipal Corporation (GVMC) officials demolishing the compound wall of the Gitam University on Saturday morning. The officials claimed the wall of the Gitam University and Medical college constructed on the government land. Reacting to the issue, Gitam University authorities said that the GVMC officials conducting the demolition work without issuing any prior notices. The road towards Gitam University was blocked and heavy police force deployed in the local. Sources said that the demolition works are undergoing from early morning 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X