విషాదం: 13వ అంతస్తుపైనుంచి దూకి ‘గీతం’ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

విశాఖ‌ప‌ట్నం: నగరంలోని గీతం విశ్వ‌విద్యాల‌యంలో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఓ విద్యార్థి గీతం క్యాంప‌స్‌లోని 13వ అంత‌స్తు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. చ‌దువులో ఒత్తిడి కార‌ణంగానే ఆ విద్యార్థి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌నపై స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని స‌దరు విద్యార్థి ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌పై ఆరా తీస్తున్నారు. ఆ విద్యార్థి వ‌ర్సిటీలో బీ ఫార్మ‌సీ చ‌దువుతున్నట్లు తెలిసింది.

 A Gitam university student allegedly committed suicide

మృతుడు హైద‌రాబాద్‌కు చెందిన శశికుమార్(19) గా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Gitam university student allegedly committed suicide on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X