వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం .. సముద్రంలో నుండి కొట్టుకొస్తుందని ఎగబడ్డ జనం

|
Google Oneindia TeluguNews

మనం సంపాదించింది ఎంత పోయినా బాధ లేదు కానీ ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది అంటే, ఉచితంగా దొరుకుతుంది అంటే మనుషులకు ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. ఇక ఆ విధంగా ఫ్రీగా దొరుకుతుంది అంటే ఎంతటి రిస్క్ అయినా చేస్తారు . కాకినాడ ఉప్పాడ సముద్ర తీరంలో ప్రస్తుతం జనం తండోపతండాలుగా చేస్తున్న పని అదే. ఉప్పాడ సముద్ర తీరంలో ఏం ఫ్రీగా దొరుకుతుంది ? ఎందుకు అంతగా జనాలు ఎగబడుతున్నారు అంటే

ఏపీకి ముంచుకొస్తున్న ఉపద్రవం.. వరుస తుఫాన్ల గండం ... డిసెంబర్ లో బురేవి , టకేటి తుఫాన్లుఏపీకి ముంచుకొస్తున్న ఉపద్రవం.. వరుస తుఫాన్ల గండం ... డిసెంబర్ లో బురేవి , టకేటి తుఫాన్లు

తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో జనాల బంగారం వేట

తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో జనాల బంగారం వేట

తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో జనాలు గుంపులుగుంపులుగా, తండోపతండాలుగా బంగారం కోసం వేట ప్రారంభించారు. సముద్రంలో నుండి బంగారం తీరానికి కొట్టుకు వస్తుందని ఓ మహిళ చెప్పడంతో, ఇక ప్రజలు ఉప్పాడ సముద్ర తీరానికి క్యూ కట్టారు. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, ఎవరు సముద్రం వైపు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ బంగారం వేట మొదలుపెట్టారు.

 సముద్రం నుండి బంగారం కొట్టుకువస్తుందని చెప్పిన మహిళ .. మొదలైన వేలంవెర్రి

సముద్రం నుండి బంగారం కొట్టుకువస్తుందని చెప్పిన మహిళ .. మొదలైన వేలంవెర్రి

సముద్రం నుండి బంగారం కొట్టుకు వస్తుందని, సముద్రతీరాన బంగారం దొరుకుతుందని ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో సముద్రంలో చేపల వేట సాగించే మత్స్యకారులతో పాటుగా, సమీప ప్రాంతాల ప్రజలు అక్కడ చాలా సీరియస్ గా బంగారం కోసం అన్వేషణ మొదలుపెట్టారు . జోరున వాన పడుతున్నా లెక్కచేయకుండా , చలి గాలులను సైతం పట్టించుకోకుండా బంగారం కోసం తెగ వెతుకుతున్నారు . సముద్ర తీరంలో తనకు బంగారం ఒక దొరికిందని, బంగారం కొట్టుకు వస్తుందని ఒక మహిళ తనకు దొరికిన ఒక బంగారం ముక్కను చూపించడంతో ఇంకేం తమకు కూడా దొరుకుతుంది అంటూ సముద్రతీరానికి పరుగులు తీశారు జనం.

సముద్రం నుండి బంగారం ... వట్టి వదంతులు అని కొట్టి పారేస్తున్న అధికారులు

సముద్రం నుండి బంగారం ... వట్టి వదంతులు అని కొట్టి పారేస్తున్న అధికారులు

అయితే ఇదంతా కరెక్ట్ కాదని అధికారులు అంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు చాలా ఇల్లు కూలిపోవడం చాలా మంది ప్రాణాలు కోల్పోవడం ,అలా కొట్టుకువచ్చినవి సముద్రంలో కలవడంతో ఏదైనా బంగారం దొరికిందేమో అని, సముద్రం లోపల నుండి బంగారం రావడం మాత్రం వాస్తవం కాదని చెబుతున్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని అధికారులు, పోలీసులు పేర్కొంటున్నారు . సముద్రం అల్లకల్లోలంగా ఉన్న ఈ సమయంలో ప్రజలు అక్కడికి వెళ్లడం మంచిది కాదంటున్నారు. అధికారులు ,పోలీసులు ఎంత చెప్పినా బంగారం దొరుకుతుందన్న బంగారం లాంటి వార్త విన్న వాళ్ళు బంగారం కోసం వెతక్కుండా ఊరుకుంటారా ఏంటి?

English summary
In the Uppada sea coast of East Godavari district, people in groups and in groups started hunting for gold. When a woman said that gold was coming to the shore from the sea, people queued up on the Uppada beach. As the sea became turbulent due to the impact of the storm, the fishermen and the nearest villages people started hunting for gold in defiance of the orders issued by the authorities .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X