గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పూజ పేరుతో వ్యాపారికి బురిడీ, 50 వేల బంగారు ఆభరణాలు మాయం

దొంగ స్వామి బారిన పడిన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వ్యాపారి శ్రీనివాసరావు యాభై వేల బంగారు ఆభరణాలను కోల్పోయాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు:దొంగ స్వాములు, పూజారులు, బాబాల గురించి మోసపోయారంటూ ప్రతిరోజూ ప్రసార సాధనాల్లో పెద్దఎత్తున ప్రచారం సాగుతోన్నా నకిలీ స్వాముల బారిన పడి తమ విలువైన సొమ్మును, నగదును కోల్పోతూనే ఉన్నారు. ఈ తరహ ఘటన ఒకటి గుంటూరులో చోటుచేసుకొంది.

గుంటూరులోని ఓ వ్యాపారి నకిలీ పూజారి బారిన పడి యాభై వేల రూపాయాల విలువైన ఆభరణాలను కోల్పోయాడు. పూజ చేస్తున్నట్టుగానే చేసి బంగారు ఆభరణాలను దొంగ పూజారి మాయం చేశాడు.

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకుగాను ఓ పూజారిని పిలిపించాడు.

gold ornaments theft by cheater in guntur

పూజలో కొంత బంగారాన్ని పెట్టాలని నకిలీ పూజారి సూచించాడు.ఈ మాటలను నమ్మిన వ్యాపారి శ్రీనివాస రావు పూజలో యాభైవేల రూపాయాల విలువైన బంగారు ఆభరణాలను పూజలో పెట్టాడు. కాసేపు పూజ చేస్తున్నట్టు నటించిన నకిలీ పూజారి ఆ బంగారు ఆభరణాలను తీసుకొన్నాడు.

పూజ పూర్తైందని చెప్పి నకిలీ పూజారి అక్కడి నుండి పారిపోయాడు. పూజారి వెళ్ళిపోయిన తర్వాత అసలు విషయాన్ని గ్రహించిన వ్యాపారి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.

English summary
gold ornaments theft by cheater in guntur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X