వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ దీక్ష: జివోఎం వెనుకడుగు, పిలిస్తే వచ్చామని చిరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

kumar reddy, chiranjeevi
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష, సీమాంధ్ర కేంద్రమంత్రుల హెచ్చరికల నేపథ్యంలో మంత్రుల బృంద (జివోఎం) తెలంగాణ విషయంలో ఒక అడుగు వెనక్కి వేసినట్లుగా తెలుస్తోంది. ఒక్క అడుగు వెనక్కి వేసినా ఇదే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కిరణ్ దీక్ష చేయడమే కాకుండా, బిల్లులో సవరణలు లేకుంటే తాము మద్దతివ్వమని సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు చెప్పారు.

దీంతో ఇదే చివరి జివోఎం సమావేశమని రెండు రోజుల క్రితం చెప్పిన ఆ బృందం సభ్యులు బుధవారం రాత్రి మరోసారి భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం మళ్లీ భేటీ కానున్నారు. ఈ రోజు కేబినెట్ ముందుకు తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తుందని చెప్పారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అది వచ్చే అవకాశాలు కనిపించడం లేదని సమాచారం. ఫిబ్రవరి 13వ జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని ముందుకు జరిపి అందులో బిల్లు పెట్టే అవకాశముంది.

సీమాంధ్ర మంత్రులు ప్రతిపాదించినవన్నీ కీలకమైన సవరణలేనని, చిదంబరం, ఆంటోని, ఆజాద్ లాంటి ముఖ్య నేతలు లేకుండా వాటిని పరిగణలోకి తీసుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని రెవెన్యూ, పోలవరం, భద్రాచలం తదితర అంశాలపై సీమాంధ్ర కేంద్రమంత్రులు పలు డిమాండ్లు కోరారు. వీటిని జివోఎం ఈ రోజు పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ ముందుకు ఈ రోజు వచ్చే అవకాశం లేదు.

జివోఎం భేటీ అనంతరం షిండే మాట్లాడుతూ.. బిల్లుపై ఇంకా కొంత కసరత్తు చేయాల్సి ఉందని, రేపటి కేబినెట్‌కు బిల్లు వస్తుందో రాదో చెప్పలేనని అన్నారు. తమ ప్రతిపాదనలు అంగీకరిస్తేనే బిల్లును అంగీకరిస్తామని తాము చెప్పామని కేంద్రమంత్రి జెడి శీలం చెప్పారు. తాము చేసిన డిమాండ్లన్నింటిని విన్నారని, చివరకు వాళ్లేం తెస్తారో చూడాలన్నారు.

వాళ్లు పిలిస్తే వచ్చాం: చిరు

తమను వాళ్లంతట వాళ్లు పిలిస్తేనే ఈ భేటీకి వచ్చామని, తమ సవరణల పట్ల మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోందని చిరంజీవి అన్నారు. తమకు కావాల్సినవి తాము డిమాండ్ చేశామని, విభజన అనివార్యమైనప్పుడు ఏం కావాలో కోరుతున్నామన్నారు. యుటి, పోలవరం ప్రాజెక్టు, భద్రాచలం ముంపు ప్రాంతాలు, రాజధాని రెవెన్యూ, ఆస్తుల పంపకాల పైన అన్నింటి పైనా తాము డిమాండ్ చేస్తామన్నారు. రాష్ట్రం యథాతథంగా ఉండే డిమాండు కూడా ఉందన్నారు. తెలంగాణ బిల్లులో క్లారిటీ లేదని, సీమాంధ్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు.

English summary
Group of Ministers (GoM) will meet on Thursday afternoon to talk about Union Ministers suggestions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X