హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జివోఎం డ్రాఫ్ట్‌లో పది భాగాలు: టికి కొత్త స్పీకర్, డిప్యూటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో మంత్రుల బృందం (జివోఎం) కేబినెట్‌కు పలు ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఇవ్వనున్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీకి తక్షణం కొత్త సభాపతిని, కొత్త డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలని ప్రతిపాదనలో సూచించినట్లుగా తెలుస్తోంది. ముసాయిదాలోని కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

వివరాల మేరకు... ముసాయిదా బిల్లులో పది భాగాలు ఉన్నాయి. ఒక్కో భాగంలో ఒక్కో అంశంపై చర్చించారు. మొదటి భాగంలో పీఠిక్, రెండో భాగంలో రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ, మూడో భాగంలో అసంబ్లీ సభ్యుల వివరాలు, పునర్వ్యవస్థీకరణ, నాలుగులో కొత్త హైకోర్టు ఏర్పాటు, ఆ తర్వాత రెండు విభాగాల్లో ఆస్తులు, అప్పులు, ఏడో విభాగంలో కార్పోరేషన్లు, ఎనిమిదో విభాగంలో ఆలిండియా రేడియో సర్వీసులు, తొమ్మిదో విభాగంలో నదీ జలాలు, బోర్డు, పదో విభాగంలో న్యాయపరమైన అంశాలు చర్చించింది.

GoM

తెలంగాణ అసెంబ్లీకి తక్షణం కొత్త స్పీకర్, కొత్త డిప్యూటీ స్పీకర్‌ను ఏర్పాటు చేయాలని, ఎక్కడి కార్పోరేషన్లు అక్కడే ఉంచాలని సూచించింది. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును అదే పేరుతో ఉంచి, తెలంగాణ హైకోర్టుకు హైకోర్టు ఆఫ్ తెలంగాణను సూచించింది.

హైకోర్టు న్యాయమూర్తులు ఎక్కడ కూర్చోవాలనే అంశంతో పాటు న్యాయమూర్తుల సంఖ్య అంశాన్నిరాష్ట్రపతికి వదిలేసింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ పక్కన తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. కృష్ణా, గోదావరి జలాలపై నిర్మించిన ప్రాజెక్టులు జనాభా నిష్పత్తిలో పంపకం చేయాలి. నదీ నిర్వహణకు మండలి. పవర్ కార్పోరేషన్లు కేంద్రం సూచించే వరకు ఎక్కడివి అక్కడే ఉంటాయి. రెండు రాష్ట్రాలలో 371డిని కొనసాగించాలి.

English summary
The GoM, set up to look into the bifurcation of AP, is all set to recommend special status to both the states under Article 371-D of the Constitution and examining a proposal to include two districts of Rayalseema in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X