• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉద్యోగుల‌కు శుభ‌వార్త : ఎన్నిక‌ల‌కు ముందే : అశోక్‌బాబు కు ఎమ్మెల్సీ

|

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందుగానే రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెబుతామ‌ని ఏపి ము ఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఉద్యోగులు ఆర్దిక ప‌రిస్థితి అర్దం చేసుకోవాల‌ని కోరుతూ తెలంగాణ కంటే త‌క్కు వేమీ చేయ‌న‌ని స్ప‌ష్టం చేసారు. ఇక‌, ముందు నుండి ఊహిస్తున్న‌ట్లుగా అశోక్‌బాబుకు ఎమ్మెల్సీ ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న చేసారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..

కాల్‌మనీ సెక్స్ రాకెట్, టీడీపీ నేతలపై రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశా.. ఎందుకంటే: జీవీఎల్

ఎన్నిక‌ల‌కు ముందే గుడ్‌న్యూస్‌..

సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే ఉద్యోగులకు శుభవార్త చెబుతానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగుల అన్ని డిమాండ్లు.. సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని, వాటిలో అవకాశం ఉన్న వాటన్నింటినీ నెరవేరుస్తానని స్ప ష్టం చేశారు. ఆర్థికమంత్రి..ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి భేటీ అయిన తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యోగులకు తక్కువ కాకుండా అన్ని సదు పాయాలు కల్పిస్తానన్నారు. విభజన సమయంలో వారితో సమానంతో 43శాతం ఫిటిమెంట్‌ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో కేంద్రం తనపై కన్నెర్ర చేసిందని, కేంద్రం సహకరించి ఉంటే ఉద్యోగులు ఆశించిన దానిక న్నా ఎక్కువగా చేసేవాడినని చెప్పుకొచ్చారు. జీడీపీలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉండటానికి ఉద్యోగులు రేయిం బవళ్లు పడిన కష్టమే కారణమని కొనియాడారు. దీంతో..పెండింగ్‌లో ఉన్న డిఏ తో పాటుగా కొత్త‌గా ఫిట్‌మెంట్ పై ఏర‌క మైన నిర్ణ‌యం తీసుకుంటారా అనే ఆస‌క్తి మొద‌లైంది.

Good news for AP employees before Elections : CM

అశోక్‌బాబుకు ఎమ్మెల్సీ ప‌ద‌వి..

ఉద్యోగ విర‌మ‌ణ చేసిన అశోక్‌బాబుకు ముందు నుండి ఊహిస్తున్న విధంగానే ముఖ్య‌మంత్రి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తున్న ట్లుగా ప్ర‌క‌టించారు. ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు ఆత్మీయ వీడ్కోలు సభలో సీఎం పాల్గొన్నారు. ఏపి ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబుకు ఎమ్మెల్సీ ఇస్తున్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు. న‌వ నిర్మాణ దీక్ష వేదిక‌గా అశోక్‌బాబును పార్టీలోకి రావాల‌ని ముఖ్య‌మంత్రి ఆహ్వానించారు. అదే స‌మ‌యంలో త‌గిన గుర్తింపు ఇస్తామ‌ని హామీ ఇ చ్చారు. ఇప్పుడు పార్టీలో చేర‌క‌ముందు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీని పై పార్టీలో భిన్నాభిప్రా యాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక‌, విభజన హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఈనెల 11న ఢిల్లీలో సీ ఎం చంద్రబాబు చేపట్టబోయే దీక్షకు ఎన్జీవోలు మద్దతు తెలిపారు. ఏపీ నుంచి తరలివచ్చి తామూ దీక్షలు పాల్గొంటా మని ఎన్జీవో సంఘ నేతలు సీయం స‌మ‌క్షంలోనే ప్ర‌క‌ట‌న చేసారు.

English summary
AP Cm Chandra Babu announced that Govt will take appropriate decision on State Govt employees issues before general elections. CM Assured on pending DA's and new fitment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X