వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సర్కార్ కు, రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ... ఆ నిధులు రిలీజ్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నిధులను విడుదల చేస్తూ సహకారం అందిస్తుంది . కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఏపీ పట్ల పలు సందర్భాల్లో సానుకూల దృక్పధాన్ని కనబరుస్తుంది . అందులో భాగంగా ఏపీకి ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించిన నిధులను విడుదల చేసింది.

ఇంగ్లీష్ స్కిల్స్ కోసం ఏపీ సర్కార్ నిర్ణయం ... విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ,ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్ఇంగ్లీష్ స్కిల్స్ కోసం ఏపీ సర్కార్ నిర్ణయం ... విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ,ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్

ఏపీకి రావాల్సిన నిధులు కేంద్రం ఇవ్వాలని వైసీపీ ఎంపీల విజ్ఞప్తులు

ఏపీకి రావాల్సిన నిధులు కేంద్రం ఇవ్వాలని వైసీపీ ఎంపీల విజ్ఞప్తులు

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో చాలా కాలంగా ఏపీ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్న విషయం తెలిసిందే . ఈ విషయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్ళారు వైసీపీ ఎంపీలు. కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన నిధుల విషయంలో తాత్సారం చేస్తుందని , తక్షణం నిధులు ఇచ్చి ఆదుకోవాలని పలు మార్లు ఏపీ సర్కార్ కేంద్రాన్ని కోరింది.

ఉపరాష్ట్రపతి వెంకయ్య చొరవతో బకాయిలు విడుదల

ఉపరాష్ట్రపతి వెంకయ్య చొరవతో బకాయిలు విడుదల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, కనీసం నిధులు కూడా ఇవ్వకుంటే ఎలా అని సీఎం జగన్ కూడా కేంద్రానికి లేఖలు రాశారు. స్వయంగా వెళ్లి కలిసి మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అర్ధం అయ్యేలా చెప్పారు. ఇక ఏపీకి సంబంధించిన నేత అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకువెళ్ళటంతో వెంకయ్య నాయుడు ఏపీ నిధుల విషయంలో చొరవ తీసుకొని సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడారు. రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు ఇచ్చేలా చేశారు.

రైతులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.2,498.89 కోట్ల రూపాయలు విడుదల

రైతులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.2,498.89 కోట్ల రూపాయలు విడుదల

కేంద్ర మంత్రులు వెంటనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడి ఏపీ రైతులకు పెండింగ్ లో ఉన్న బకాయిల విషయం అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ఏపీకి రావాల్సిన రూ.2,498.89 కోట్ల రూపాయల నిధులను కేంద్రం రిలీజ్ చేసింది. ఈ మొత్తం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కేంద్రం మంజూరు చేసింది. ఇక అక్కడి నుంచి ఈ నిధులు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖకు బదిలీ కాబోతున్నాయి.

Recommended Video

Rajya Sabha Election Schedule Released,Political Heat Starts In Telugu States! | Oneindia Telugu
 ఏపీ రైతులకు, ప్రభుత్వానికి శుభవార్త

ఏపీ రైతులకు, ప్రభుత్వానికి శుభవార్త

వెంకయ్య నాయుడు చొరవతో జరిగిన ఈ ఉపకారం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త అని చెప్పాలి. అసలే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందులలో కొట్టు మిట్టాడుతున్న తరుణంలో కేంద్రం రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చెయ్యటం చల్లని వార్త . ఇంకా ఏపీకి రావాల్సిన బకాయిల విషయంలో కూడా కేంద్రం కనికరించాలని, త్వరితగతిన నిధులు ఇవ్వాలని ఏపీ సర్కార్ కోరుతుంది.

English summary
The center has released Rs 2,498.89 crore in pending dues from farmers. The Union Ministers immediately spoke to the Food Corporation of India and Food and Civil Supplies Department officials and inquired about the pending dues from AP farmers. The center has sanctioned the entire Food Corporation of India. From there, the funds will be transferred to the Andhra Pradesh Department of civil supplies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X