వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. అన్ని శాఖల్లో 63 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ కసరత్తు

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ నిరుద్యోగ యువతకు మరోమారు శుభావార్త చెప్పింది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలను కల్పించిన వైసీపీ సర్కార్ ఈసారి అన్ని శాఖల్లోనూ భారీగానే ఉద్యోగాల భర్తీకి సిద్ధం అవుతుంది. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం జగన్ ఉన్నత అధికారులకు పలు సూచనలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 63 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు .

విద్యా వైద్య రంగాల్లో సమూల మార్పులకు ఖాళీలు భర్తీ చేసి గాడిలో పెట్టే యోచన

విద్యా వైద్య రంగాల్లో సమూల మార్పులకు ఖాళీలు భర్తీ చేసి గాడిలో పెట్టే యోచన


విద్యా వైద్య రంగాల్లో సమూల మార్పులు కోరుకుంటున్నానని, ఆయా రంగాలలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని జగన్ అధికారులకు సూచించారు.విద్యారంగ అభివృద్ధి కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటే, స్కూళ్లలో సిబ్బంది లేక అభివృద్ధి సాధ్యం కావడం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య తగినంత లేకుంటే స్కూల్స్ లో సామర్థ్యంపై ఆ ప్రభావం పడుతుందని జగన్ పేర్కొన్నారు. స్కూళ్లలో ల్యాబ్ టెక్నీషియన్లు సైతం ఉండాలని ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలని జగన్ ఆదేశించారు.

అన్ని విభాగాల్లోనూ ప్రాధాన్యతను అనుసరించి పోస్టుల భర్తీకి ప్రణాళిక

అన్ని విభాగాల్లోనూ ప్రాధాన్యతను అనుసరించి పోస్టుల భర్తీకి ప్రణాళిక


అంతేకాకుండా పోలీసు శాఖలో వీక్లీ ఆఫ్ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని, శాఖ సామర్థ్యం తగ్గకుండా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అన్ని విభాగాల్లోనూ ప్రాధాన్యతను అనుసరించి పోస్టుల భర్తీకి ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులకు తెలిపారు. ఇక సీఎం తాను చేసిన సూచనలపై అధికారులను నివేదిక ఇవ్వాలని కోరారు. అయితే సీఎంకు పలు ప్రభుత్వ శాఖల్లో సుమారు 63 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీటిపై లోతైన అధ్యయనం కూడా జరుగుతుంది .

ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటన మార్చిలో జారీ చేసే అవకాశం

ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటన మార్చిలో జారీ చేసే అవకాశం

ఇక శాఖవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ క్యాలెండర్ విడుదలపై నిర్వహించిన సమీక్షలో
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భర్తీ జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇక ఏపీపీఎస్సీ ద్వారా 19 వేల పోస్టులు , అలాగే డీఎస్సీ ద్వారా 21 వేల పోస్టులను, పోలీస్ శాఖలో 13 వేల పోస్టులను ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. త్వరలోనే వీటిని భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటన మార్చిలో జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

English summary
YCP government, who was in power in AP, once again said good news to the unemployed youth. There will be massive job opportunites in all departments. Various suggestions were made to the top executives of CM Jagan, who held a high-level review conference on the job replacement calendar. AP CM YS Jaganmohan Reddy has directed officials to fill vacancies in various departments in the state. Officials have identified more than 63,000 vacancies so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X