వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంగార్డులకు సిఎం చంద్రబాబు వరాల జల్లు:దినసరి వేతనం రెట్టింపు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న హోంగార్డులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. హోంగార్డుల దినసరి వేతనాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ఇప్పటివరకు రు. రూ.300 గా ఉన్న హోం గార్డుల దినసరి వేతన రూ.600కు పెంచుతున్నట్లు శుక్రవారం సిఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే మహిళ హోంగార్డుల మెటర్నిటీ సెలవులను మూడు నెలలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.2.5 లక్షల మేర వైద్య సాయం కల్పించారు. హోంగార్డులకు ఇళ్ల మంజూరు అంశంపై పరిశీలన చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

 Good News for Home Guards in Andhra Pradesh State

హోంగార్డులు చనిపోతే దహన సంస్కారాలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. హోంగార్డులు సిఎం చంద్రబాబును కలిసి తమ సమస్యల గురించి మొరపెట్టకోగా సిఎం సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు వెంటనే ప్రకటన జారీ చేశారు. సమస్యల గురించి మొరపెట్టకున్న వెంటనే సిఎం స్పందించడంపై హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Amaravati:AP Chief Minister Chandrababu Naidu on friday showered with boons on Home Guards working across the state with salary hikes along with the announcement of few incentives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X