• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ... స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్

|

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం ఫలించింది . ఏపీ ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కావాలని వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సెలవు పెట్టి మరీ వెయిట్ చేస్తున్న స్టీఫెన్ రవీంద్ర కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి లైన్ క్లియరైంది. జగన్ తన అధికార యంత్రాంగంలో స్టీఫెన్ రవీంద్రకు, అలాగే శ్రీ లక్ష్మి కి స్థానం కల్పించాలని నిర్ణయించిన నేపధ్యంలో కేంద్రం నుండి క్లియరెన్స్ కోరారు. ఇక స్టీఫెన్ రవీంద్ర ఏపీలో నియామకానికి సంబంధించి తాజాగా కేంద్రం ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం.

జగన్ ఢిల్లీ పర్యటనల ఎఫెక్ట్ .. ఎన్డీఏలోకి వైసీపీ ... జోరందుకున్న ప్రచారంపై కన్నా ఏం చెప్పారంటే

స్టీఫెన్ రవీంద్ర విషయంలో జగన్ కు కేంద్రం శుభవార్త

స్టీఫెన్ రవీంద్ర విషయంలో జగన్ కు కేంద్రం శుభవార్త

స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్‌కు కేంద్ర హోంశాఖ గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మళ్ళీ ఆ ఫైల్ ను పెండింగ్ పెట్టింది . తాజాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసిన రెండు రోజులకే కేంద్రం స్టీఫెన్ కు పచ్చ జెండా వూపటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది . ఇక కేంద్రం స్టీఫెన్ కు అఫీషియల్ గా ఆమోదం తెలిపింది. ఇప్పుడు కేంద్రం ఆమోదం తెలపడంతో.. త్వరలోనే స్టీఫెన్ రవీంద్ర ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారనే ప్రచారం సాగుతోంది.

  AP CM YS Jagan On Disha Call Center And Disha Application At Rajahmundry | Oneindia Telugu
  ప్రభుత్వ యంత్రాంగంలో స్టీఫెన్ ను భాగం చెయ్యాలనుకున్న జగన్

  ప్రభుత్వ యంత్రాంగంలో స్టీఫెన్ ను భాగం చెయ్యాలనుకున్న జగన్

  1990 బ్యాచ్‌కు చెందిన ఈయన.. సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్రని తిరిగి తన ప్రభుత్వ యంత్రాంగంలో భాగం చేసుకోవాలని సీఎం జగన్ భావించారు. స్టీఫెన్ రవీంద్ర రాయలసీమలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. స్టీఫెన్ కోసం కేంద్రం అనుమతి కోరగా ఎట్టకేలకు కేంద్రం స్టీఫెన్ విషయంలో సానుకూలంగా స్పందించింది .

  జగన్ ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ .. స్టీఫెన్ కు గ్రీన్ సిగ్నల్.

  జగన్ ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ .. స్టీఫెన్ కు గ్రీన్ సిగ్నల్.

  ఇక, జగన్ సీఎం అయినప్పటి నుంచి స్టీఫెన్ రవీంద్ర కోసం పట్టుబడుతున్నారు. వై సీపీ ఎంపీలు కూడా ఆయన కోసం తీవ్ర ప్రయత్నాలే చేశారు .ఈ విషయాన్ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో కూడా చర్చించారనే ప్రచారం సాగింది. మొత్తానికి జగన్ కోరిక నెరవేరిందని తాజా నిర్ణయం ద్వారా తెలుస్తుంది. జగన్ ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ తోనే స్టీఫెన్ విషయంలో కేంద్రం స్పందించిందని తెలుస్తుంది . ఇక స్టీఫెన్ తో పాటు వై ఎస్ హయాంలో మైనింగ్ శాఖా కార్యదర్శిగా పని చేసిన శ్రీ లక్ష్మికి కూడా ప్రభుత్వ యంత్రాంగంలో స్థానం కల్పించాలని భావించారు.

  శ్రీ లక్ష్మి విషయంలోనూ వైసీపీ ప్రయత్నం .. కేంద్రం ఏం చెప్తుందో ?

  శ్రీ లక్ష్మి విషయంలోనూ వైసీపీ ప్రయత్నం .. కేంద్రం ఏం చెప్తుందో ?

  ఓబులాపురం మైనింగ్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని రెండేళ్ళ పాటు జైలుకు వెళ్లి వచ్చిన శ్రీ లక్ష్మి జగన్ ను కలిసి ఏపీ ప్రభుత్వ యంత్రాంగంలో పని చేస్తానని కోరిన మేరకు ఆమెకు కూడా తమ అధికార యంత్రాంగంలో స్థానం కల్పించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరినీ తమ రాష్ట్రానికి కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడ ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ ఈ విషయమై అంగీకారం తెలిపారు. మరో వైపు ఇదే విషయమై ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ కోసం కేంద్రానికి లేఖ రాశారు.కానీ శ్రీలక్ష్మి విషయంలో కేంద్రం ఇంకా ఏమీ స్పందించలేదు .

  English summary
  The center has given clearance to Stephen Ravindra, who has been on leave for the past few months to become part of the AP government. The line has been cleared for the appointment of Stephen Ravindra as Andhra Pradesh State Intelligence Chief. Jagan sought clearance from the Center in the wake of his decision to appoint Stephen Ravindra as well as Sri Lakshmi in his administration.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X