వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కు గుడ్ న్యూస్ ...స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్ చేసిన కేంద్రం .. మరి శ్రీలక్ష్మి మాటేంటి ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్ | Jagan Likely To Pick TS Top Cop Stephen Ravindra As Ap Intel Cheif

ఏపీ ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కావాలని గత రెండు నెలలుగా సెలవు పెట్టి మరీ వెయిట్ చేస్తున్న స్టీఫెన్ రవీంద్ర కు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి లైన్ క్లియరైంది. జగన్ తన అధికార యంత్రాంగంలో స్టీఫెన్ రవీంద్రకు, అలాగే శ్రీ లక్ష్మి కి స్థానం కల్పించాలని నిర్ణయించిన నేపధ్యంలో కేంద్రం నుండి క్లియరెన్స్ కోరారు. ఇక వీరిలో స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్‌కు కేంద్ర హోంశాఖ బుధవారంనాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో కేంద్రం నుండి ఆదేశాలు జారీ కానున్నాయని తెలుస్తుంది .

స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి లను ఎపీకి కేటాయించాలని కేంద్రాన్ని క్లియరెన్స్ కోరిన జగన్

స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి లను ఎపీకి కేటాయించాలని కేంద్రాన్ని క్లియరెన్స్ కోరిన జగన్


ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత స్టీఫెన్ రవీంద్రను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించుకోవాలని భావించారు. అలాగే వై ఎస్ హయాంలో మైనింగ్ శాఖా కార్యదర్శిగా పని చేసి ఓబులాపురం మైనింగ్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని రెండేళ్ళ పాటు జైలుకు వెళ్లి వచ్చిన శ్రీ లక్ష్మి జగన్ ను కలిసి ఏపీ ప్రభుత్వ యంత్రాంగంలో పని చేస్తానని కోరిన మేరకు ఆమెకు కూడా తమ అధికార యంత్రాంగంలో స్థానం కల్పించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరినీ తమ రాష్ట్రానికి కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడ ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ ఈ విషయమై అంగీకారం తెలిపారు. మరో వైపు ఇదే విషయమై ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ కోసం కేంద్రానికి లేఖ రాశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఎంసీ బిల్లుపై భగ్గుమన్న వైద్య సిబ్బంది ...ఎమర్జెన్సీ మినహా వైద్య సేవలు బంద్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఎంసీ బిల్లుపై భగ్గుమన్న వైద్య సిబ్బంది ...ఎమర్జెన్సీ మినహా వైద్య సేవలు బంద్

 కేంద్రంలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి .. స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్

కేంద్రంలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి .. స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్

అయితే ఈ విషయమై కేంద్రం నుండి ఇంతవరకు ఎలాంటి స్పందన రాకపోవటంతో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ఈ విషయమై మరోసారి తమ ప్రయత్నాలు చేశారు . ఏకంగా శ్రీలక్ష్మిని తీసుకువెళ్ళి మరీ అమిత్ షాను కలిసి క్లియరెన్స్ కోసం వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి కూడా ప్రయత్నం చేశారు. వైసీపీ ఎంపీలు స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి ల విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేసిన ఫలితం కేంద్రం నుండి సానకూలంగా స్పందన లభించింది. రెండు మూడు రోజుల్లో స్టీఫెన్ రవీంద్రకు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. దీంతో స్టీఫెన్ రవీంద్రను జగన్ ఇంటలిజెన్స్ విభాగానికి చీఫ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

శ్రీలక్ష్మి విషయంలో సస్పెన్స్ .. ఆమెపై కూడా సానుకూల నిర్ణయమేనా ?

శ్రీలక్ష్మి విషయంలో సస్పెన్స్ .. ఆమెపై కూడా సానుకూల నిర్ణయమేనా ?


ఇక శ్రీ లక్ష్మి విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. ఆమె తన కేడర్ మార్పు కోసం ఆమె డీఓపీటీని ఆశ్రయించారు.కానీ, శ్రీలక్ష్మి విషయంలో డీఓపీటీ నుండి కూడ ఎలాంటి సమాధానం రాలేదు. వారం రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను శ్రీలక్ష్మి కలిశారు. కేడర్ మార్పు విషయమై ఆమె అమిత్ షా తో చర్చించారు. శ్రీలక్ష్మికి కూడ కేడర్ మార్పు విషయంలో సానుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చూడాలి జగన్ ఏపీ ప్రభుత్వ శాఖల్లో అవకాశం ఇవ్వాలనుకున్న వారి విషయంలో భవిష్యత్ రాజకీయాలు ఎలా మారనున్నాయో.

English summary
The center has given clearance to Stephen Ravindra, who has been on leave for the past two months to become part of the AP government. The line has been cleared for the appointment of Stephen Ravindra as Andhra Pradesh State Intelligence Chief. Jagan sought clearance from the Center in the wake of his decision to appoint Stephen Ravindra as well as Sri Lakshmi in his administration.Stephen Ravindra was intercepted by the Union Home Ministry on Wednesday, giving the green signal. It is learned that orders will be issued from the Center within two to three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X