కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపిలోకి డిఎల్ రవీంద్రారెడ్డి, టిటిడి ఛైర్మెన్‌గా సుధాకర్‌ యాదవ్?

టిటిడి ఛైర్మెన్ పదవి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు దక్కే అవకాశం ఉంది. కడప జిల్లా టిడిపి మైదుకూరు ఇంచార్జీగా సుధాకర్‌యాదవ్ కొనసాగుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: టిటిడి ఛైర్మెన్ పదవి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు దక్కే అవకాశం ఉంది. కడప జిల్లా టిడిపి మైదుకూరు ఇంచార్జీగా సుధాకర్‌యాదవ్ కొనసాగుతున్నారు.మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరికకు రంగం సిద్దమైందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే సుధాకర్‌యాదవ్‌కు టిటిడి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టనున్నారని ప్రచారం సాగుతోంది.

బాబుకు మళ్ళీ దగ్గరౌతున్న హరికృష్ణ: మళ్ళీ రాజ్యసభకుబాబుకు మళ్ళీ దగ్గరౌతున్న హరికృష్ణ: మళ్ళీ రాజ్యసభకు

టిటిడి ఛైర్మెన్‌గా చదలవాడ కృష్ణమూర్తి పదవీకాలం ముగిసింది. టిటిడి ఛైర్మెన్ పదవీ కాలం ముగిసి సుమారు ఆరు మాసాలు దాటినా కానీ, ఇంకా కొత్త పాలకవర్గాన్ని నియమించలేదు. టిటిడి ఛైర్మెన్ పదవిని హరికృష్ణకు ఇవ్వాలని తొలుత భావించినట్టు ప్రచారం సాగింది. అయితే కొన్ని కారణాలతో హరికృష్ణకు బదులుగా నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు పేరు తెరమీదికి వచ్చింది.

హరికృష్ణకు చంద్రబాబు బంపర్ ఆఫర్: జూ.ఎన్టీఆర్ కోసమే?హరికృష్ణకు చంద్రబాబు బంపర్ ఆఫర్: జూ.ఎన్టీఆర్ కోసమే?

పుట్టా సుధాకర్‌యాదవ్‌కు టిటిడి ఛైర్మెన్ పదవి?

పుట్టా సుధాకర్‌యాదవ్‌కు టిటిడి ఛైర్మెన్ పదవి?

టిటిడి ఛైర్మెన్ పదవి కోసం టిడిపిలో తీవ్రమైన పోటీ నెలకొంది. గుంటూరు, రాజమండ్రి ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్‌లు ఈ పదవి కోసం చంద్రబాబుపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అయితే పార్టీలో ఒకరికి ఒకే పదవిని ఇవ్వనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.హరికృష్ణకు టిటిడి ఛైర్మెన్ పదవి ఇవ్వాలని భావించినట్టు ప్రచారం సాగింది. ఆ తర్వాత బీద మస్తాన్‌రావు పేరు తెరమీదికి వచ్చింది. అయితే రాజకీయ కారణాల నేపథ్యంలో సుధాకర్‌యాదవ్‌ పేరును టిటిడి ఛైర్మెన్ పదవి కోసం ప్రతిపాదించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారని సమాచారం. సుధాకర్‌యాదవ్‌ను టిటిడి ఛైర్మెన్‌గా నియమిస్తే కడప జిల్లాల్లో రాజకీయ సమీకరణాలను మార్చే దిశగా చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు.

Recommended Video

DL Ravindra Reddy may join TDP జగన్‌కు షాక్: డిఎల్ రవీంద్రారెడ్డితో బాబు చెక్? | Oneindia Telugu
డిఎల్‌ రవీంద్రారెడ్డికి మైదుకూరు టిక్కెట్టు

డిఎల్‌ రవీంద్రారెడ్డికి మైదుకూరు టిక్కెట్టు

2014 ఎన్నికల సమయంలో మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత డిఎల్ రవీంద్రారెడ్డి చంద్రబాబునాయుడును హైద్రాబాద్‌లో కలిశారు. టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే కడప పార్లమెంట్ టిక్కెట్టు కేటాయించాలా, మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వాలా అనే విషయమై తేలలేదు. డిఎల్ మైదుకూరు టిక్కెట్టు కోసం పట్టుబట్టినట్టు సమాచారం. దీంతో డిఎల్ టిడిపిలో చేరలేదు. కానీ, ఇటీవ కాలంలో కడప జిల్లాలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరాలని నిర్ణయించుకొన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో 10 రోజుల క్రితం డిఎల్ రవీంద్రారెడ్డి ఏపీ సిఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని సమాచారం.

డిఎల్ రవీంద్రారెడ్డి పోటీ చేస్తే సానుకూల ఫలితం

డిఎల్ రవీంద్రారెడ్డి పోటీ చేస్తే సానుకూల ఫలితం

సుధాకర్‌యాదవ్ కాంట్రాక్టర్. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు సుధాకర్‌యాదవ్ టిడిపిలో చేరారు. 2014 ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేశారు..వైసీపీ అభ్యర్థి ఎస్‌.రఘురామిరెడ్డి ఆయనపై గెలిచారు. ఓడిన తర్వాత కూడా సుధాకర్‌ నియోజకవర్గంపై బాగా దృష్టి పెట్టి పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నారు. వైసీపీ నుంచి చాలా మందిని పార్టీలోకి తీసుకొచ్చారు. కానీ మైదుకూరు నియోజకవర్గంలో రాజకీయంగా పట్టున్న ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలకు, సుధాకర్ యాదవ్‌కు మధ్య అగాధం ఏర్పడడం అధిష్ఠానానికి ఇబ్బందిగా మారింది. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకుని మైదుకూరులో పోటీ చేయిస్తే విజయావకాశాలు బాగుంటాయని కొందరు పార్టీ నేతలు అధిష్ఠానం ముందు ప్రతిపాదన పెట్టారు.దీంతో డిఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలో తీసుకోవాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.

వైసీపీకి చెక్ పెట్టేందుకు

వైసీపీకి చెక్ పెట్టేందుకు

నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు టిటిడి ఛైర్మెన్ పదవి ఇవ్వాలని భావించారు. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన సుధాకర్‌యాదవ్‌కు ఈ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.సుధాకర్‌యాదవ్‌కు ఈ పదవిని కట్టబెట్టడం ద్వారా కడప జిల్లా

English summary
Mydukuru Tdp incharge Putta Sudhakar Yadav's name has come up for consideration by the TDP leadership for the post of the coveted Tirumala Tirupati Devasthanams’ Trust Board Chairman. Former minister DL Ravindra reddy will join in Tdp soon. So TDP chief Chandrababu naidu consideration Sudhakar Yadav's name for TTD chairman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X