టిడిపి నేత, మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ శ్రీదేవి ఆత్మహత్య
గుంటూరు: తెలుగుదేశం మహిళా నేత, మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ గోపవరపు శ్రీదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందుతాగిన శ్రీదేవి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆమెను మాచర్లలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు.

కాగా, మార్గమధ్యలోనే శ్రీదేవి ప్రాణాలు కోల్పోయారు. శ్రీదేవి భర్త మల్లికార్జునరావు 3 నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. రాజకీయ ఒత్తిళ్లతో కొద్ది రోజుల క్రితమే శ్రీదేవి పదవి నుంచి తప్పుకున్నారు.
శ్రీదేవి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కూడా కారణమంటున్న ఆమె బంధువులు అంటున్నారు. కాగా, మరోవైపు శ్రీదేవి ఆత్మహత్య అధికార పార్టీలో కలకలంగా మారింది.












Click it and Unblock the Notifications