వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కపటం ఎరుగని కడప బిడ్డతో 150 అమాయకపు దొంగలు ..వైసీపీ సినిమా... గోరంట్ల వ్యంగ్యం

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు . నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ నేతలు అసెంబ్లీలో మాట్లాడుతున్న భాషపై అశ్లీల భాష యొక్క పాఠశాల షార్ట్ టర్మ్ కోర్టు అందుబాటులో కలదు అని దానికి ప్రిన్సిపాల్ రోజా అని పేర్కొన్నారు. ఇక నేడు మరో పోస్ట్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఏపీలో కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన ట్వీట్ చేశారు.

YSRCP అశ్లీల భాషా పాఠశాల .. ప్రిన్సిపాల్ రోజా, హెచ్ఓడి గా కొడాలి నాని : గోరంట్ల సెటైర్లుYSRCP అశ్లీల భాషా పాఠశాల .. ప్రిన్సిపాల్ రోజా, హెచ్ఓడి గా కొడాలి నాని : గోరంట్ల సెటైర్లు

 వైసీపీ నేతలతో సినిమా క్రూ అండ్ క్యాస్ట్ చెప్పిన గోరంట్ల

వైసీపీ నేతలతో సినిమా క్రూ అండ్ క్యాస్ట్ చెప్పిన గోరంట్ల

వైసీపీ నేతలే నటులు , నిర్మాతలు, డైరెక్టర్ లు గా ఓ సినిమా తీస్తున్నట్టు ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డైరెక్టర్, విలన్, రచయిత, స్పాన్సర్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వైసీపీ నేతలను పోలుస్తూ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది . అంతకంటే ముందు ఉదయం 9 గంటలకు తాను ట్వీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ లో గోరంట్ల గారి వెటకారం నడుస్తుంది. ఆపోజిట్ బ్యాచ్ కి కంటెంట్ దొరకడం లేదు అంటూ మరో ట్వీట్ చేసిన గోరంట్ల సినిమా గురించి చెప్తానంటూ అందరూ వెయిట్ చెయ్యాలంటూ ట్వీట్ పెట్టి టీజర్ వదిలారు.

రసగుల్ల గోంగూర కర్మ (RGV) సమర్పించు కపటం ఎరుగని కడప బిడ్డతో 150 అమాయకపు దొంగలు

రసగుల్ల గోంగూర కర్మ (RGV) సమర్పించు కపటం ఎరుగని కడప బిడ్డతో 150 అమాయకపు దొంగలు

ఇక ఆయన తన ట్వీట్ లో బ్లాక్ బస్టర్ ఫ్రైడే రిలీజ్ అంటూ రసగుల్ల గోంగూర కర్మ (RGV) సమర్పించు అంటూ వర్మను టార్గెట్ చేసి మొదలెట్టారు. ఇక సినిమా పేరు కపటం ఎరుగని కడప బిడ్డతో 150 అమాయకపు దొంగలు అంటూ టైటిల్ లోనే ఆయన వ్యంగ్యం అంతా చూపించారు . ఇక ఈ ఈవెంట్ సమర్పిస్తున్న వారు బోస్టన్ గ్రూప్ అంటూ పేర్కొన్నారు. ఆన్లైన్లో వీక్షకులు కోసం ఈ - సాక్షి సౌకర్యం కలదు అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ కిషోర్ అని పేర్కొన్నారు. ఎందుకంటె ఆయనకు అనేక నేషనల్ పార్టీలకు సినిమా చేసిన అనుభవం ఉందని చెప్పారు.

నిర్మాతలుగా విజయసాయిరెడ్డి, బుగ్గన

నిర్మాతలుగా విజయసాయిరెడ్డి, బుగ్గన

ఇక నిర్మాతలుగా విజయసాయిరెడ్డి, బుగ్గన వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు . ఎందుకంటే వారికి పెద్ద సినిమాలకు తప్పుడు లెక్కతో లాభాలు తీసుకున్న అనుభవం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్కిన చరిత్ర ఉందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా ఆళ్ల రామకృష్ణ ఎందుకంటె ఆయనకు కరకట్ట కమలహాసన్‌గా పేరు ఉంది కాబట్టి తీసుకున్నట్టు చెప్పారు. అంతే కాదు అంబటి రాంబాబును కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తీసుకున్నామని ఏ పాత్ర నందు అయినా జీవించడం ఈయన ప్రత్యేకత అని పేర్కొన్నారు.

విలన్ కోడి కత్తి శ్రీనివాస్ , కమెడియన్స్ పృధ్వీ , పోసాని

విలన్ కోడి కత్తి శ్రీనివాస్ , కమెడియన్స్ పృధ్వీ , పోసాని


పుష్ప శ్రీ వాణి టిక్ టాక్ స్టార్‌గా అతి తక్కువ కాలంలో ప్రాచుర్యం పొందారని , రోజాకు దూషించడం మరియు భయానకంగా పరిస్థితి మార్చడంలో ప్రత్యేకత ఉందని వీరు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లని పేర్కొన్నారు. ఇక కమెడియన్స్ విషయంలో పృథ్వీరాజ్ 30 ఏళ్ల పాటు వెనుకనుండే ఏ పనినైనా చిటికెలో చేస్తాడని , పోసానికి రాజకీయాల్లో నట బీభత్స అనే బిరుదు ఉందని పేర్కొన్నారు. విలన్ గా కోడి కత్తి శ్రీనివాస్ ను పెట్ట్కున్నారని ఎందుకంటే ప్రచారం కోసం కోడికత్తితో చిన్నగా గుచ్చడం ఈయన ప్రత్యేకత అని తెలిపారు.

మెయిన్ ఆర్టిస్ట్ లు అనీల్ కుమార్ యాదవ్, కొడాలి నానీ లు

మెయిన్ ఆర్టిస్ట్ లు అనీల్ కుమార్ యాదవ్, కొడాలి నానీ లు

ఇక మెయిన్ ఆర్టిస్ట్ గా అనీల్ కుమార్ యాదవ్ ఉన్నారని గన్ వాడడం రాకపోయినా బుల్లెట్లు దింపుతుంటాడు కాబట్టి ఈయనే మెయిన్ ఆర్టిస్ట్ అని పేర్కొన్నారు. ఇక కొడాలి నాని కూడా మెయిన్ ఆర్టిస్ట్ అని పేర్కొన్న ఆయన ఏదైనా సరే నోటి దురదతో మొదలుపెడుతాడని చెప్పారు . పెద్దిరెడ్డి విషయంతో పని లేకుండా మధ్యలో రావడం ఈయన ప్రత్యేకత అని చెప్పారు.
మెయిన్ రోల్ జలగన్న అని చెప్పి టోల్ గేట్ దగ్గర ఎడ్లబండికి, బైక్‌కి కూడా టాక్స్ కట్టడంతో ఈయన దేశాన్ని సంతోషింపచేశాడు అంటూ చురకలు వేశారు .

డైలాగ్ రైటర్ గా బొత్స నత్తి బాబు, సెన్సార్ ఇచ్చేది నమ్మలేని సీతారాం అంటూ వ్యంగ్యం

డైలాగ్ రైటర్ గా బొత్స నత్తి బాబు, సెన్సార్ ఇచ్చేది నమ్మలేని సీతారాం అంటూ వ్యంగ్యం

ఇక డైలాగ్ రైటర్ గా బొత్స నత్తి బాబు అని చెప్తూ అనేక మాటలను అవలీలగా చెప్పడం మరి చెప్పించడం ఈయన ప్రత్యేకత అని వివరించారు . ఇక మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి అని ఏమి చెప్పిన భజన బాగా వాయించడం ఈయన ప్రత్యేకత అన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేది మాత్రం నమ్మలేని సీతారాం అంటూ సినిమా మొత్తం పడుకుని చివరిగా సంతకం పెట్టడం ఈయన ప్రత్యేకత అని చాలా వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇక ఈ సినిమా అశేష అభిమానులు, ఖైదీల నడుమ భారీ విడుదల కానుందని ప్రీ రిలీజ్ వసూళ్లు, ఆన్లైన్, శాటిలైట్ హక్కులు, ఓవర్సీస్ అంతా కలిపి లక్ష కోట్లు అన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి .

English summary
In a post on the social media platform, TDP leader Gorantla Buchaiah Chowdhary said that the YCP leaders are making a film as actors, producers and directors will go viral on social media. A tweet comparing YCP leaders as director, villain, writer, sponsor and character artist has become interesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X