రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

5 నెలల్లోనే ఎంత మార్పు: బాబుకు సన్నిహితంగా గోరంట్ల, ఆ ఇష్యూలేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Gorantla Buchaiah and Chandrababu Relation బాబుకు సన్నిహితంగా గోరంట్ల,అందుకేనా ! | Oneindia Telugu

రాజమండ్రి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మళ్ళీ దగ్గరయ్యారు. మంత్రివర్గంలో స్థానం దక్కలేదనే కారణంగా పార్టీ అధినేత తీరుపై అసంతృప్తిగా ఉన్న బుచ్చయ్య చౌదరి తిరిగి బాబు వద్ద మార్కులు కొట్టేశారు. బాబుకు అత్యంత సన్నిహితుల జాబితాలో చేరిపోయారు.

మంత్రివర్గం చిచ్చు: మెట్టుదిగని సీనియర్లు , అమీతుమీకి సిద్దం, బాబు వ్యూహమిదేమంత్రివర్గం చిచ్చు: మెట్టుదిగని సీనియర్లు , అమీతుమీకి సిద్దం, బాబు వ్యూహమిదే

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంది గోరంట్ల బుచ్చయ్యచౌదరి టిడిపిలోనే ఉన్నారు. 1995లో టిడిపి సంక్షోభ సమయంలో ఎన్‌టిఆర్ పక్షాన కొంత కాలం పాటు గోరంట్లబుచ్చయ్యచౌదరి కొనసాగారు.

అయితే ఆ తర్వాత గోరంట్లబుచ్చయ్యచౌదరి చంద్రబాబువైపుకు వచ్చారు.2014 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ స్థానం నుండి పోటీచేసి విజయం సాధించారు. అయితే ఆయన గతంలో రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు.

 బాబుకు మళ్ళీ దగ్గరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

బాబుకు మళ్ళీ దగ్గరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మళ్ళీ దగ్గరయ్యారు.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ సమయంలో మంత్రి పదవి వస్తోందని భావించినా మంత్రి పదవి దక్కకపోవడంతో గోరంట్ల బుచ్చయ్యచౌదరి చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీని ఎటు తీసుకెళ్తున్నారంటూ బాబుపై నిప్పులు చెరిగారు.కానీ, పరిస్థితులు మారాయి. కారణాలు ఏమైతేనేం బుచ్చయ్య చౌదరి మళ్ళీ చంద్రబాబునాయుడు సన్నిహితుల జాబితాలోకి చేరిపోయారు.

 ఆ రెండు ఘటనలు బాబుకు దగ్గర చేశాయి.

ఆ రెండు ఘటనలు బాబుకు దగ్గర చేశాయి.


ఏపీ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల విషయమై రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను గోరంట్ల బుచ్చయ్యచౌదరి తిప్పికొట్టారు. ఉండవల్లితో చర్చకు తాను సిద్దమేనని గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడ ప్రకటించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద చర్చకు వెళ్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గోరంట్ల వ్యూహం సత్పలితాలను ఇచ్చిందని చంద్రబాబు అభిప్రాయంతో ఉన్నారు.

3కాకినాడలో సగం డివిజన్లలో గోరంట్ల వ్యూహం

3కాకినాడలో సగం డివిజన్లలో గోరంట్ల వ్యూహం


కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో సగం డివిజన్లలో గోరంట్ల అనుసరించిన వ్యూహం సత్పలితాలను ఇచ్చింది. పార్టీ ఇంచార్జీగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి సగం డివిజన్లలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, స్థానికంగా ఉన్న పరిస్థితులు, గెలుపు ఓటములపై ప్రభావం చూపే అంశాలను అంచనావేసి అందుకు అనుగుణంగా పార్టీ వ్యూహన్ని అమలు చేశారు. ఈ వ్యూహం సత్పలితాలను ఇచ్చిందని పార్టీ నాయకులు చంద్రబాబుకు నివేదికను ఇచ్చారు.

రాజమండ్రి స్థానంలో పోటీ కోసమేనా/

రాజమండ్రి స్థానంలో పోటీ కోసమేనా/


2019 ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుండి పోటీచేయాలని గోరంట్ల బుచ్చయయ్య చౌదరి ఆసక్తిగా ఉన్నారు. రాజమండ్రి రూరల్ స్థానంలో బుచ్చయ్యచౌదరికి కొంత అసంతృప్తి ఉందని పార్టీలో ప్రచారంలో ఉంది. అయితే గతంలో పలు దఫాలు రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుండే బుచ్చయ్యచౌదరి పోటీ చేసి విజయం సాధించారు.అయితే వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి స్థానం దక్కాలంటే అధినేతతో కొంచెంద సఖ్యతగా ఉంటే టిక్కెట్లు కేటాయింపు విషయంలో సానుకూల వాతావరణం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారని పార్టీలో కొందరు అభిప్రాయపడుతున్నారు.

కానీ, బిజెపితో పొత్తు కారణంగా రాజమండ్రి అసెంబ్లీ స్థానంపై బిజెపి పట్టుబట్టడంతో గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమండ్రి రూరల్ స్థానానికి మారాల్సి వచ్చింది.కానీ, మంత్రివర్గంలో స్థానం దక్కని కారణంగా చంద్రబాబుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

English summary
Rajahmundry rural Mla Gorantla Buchaiah chowdary participated very actively in party programmes. Buchaiah chowdary was dissatisfied on chandrababu he didn't get cabinet berth in reshuffle. But He forget that cabinet berth.He will planning to contest from Rajahmundry segment in 2019 elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X