వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్! తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదు: టీడీపీ, బాబుపై విజయసాయి

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదని తెలుగుదేశం పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంగళవారం అన్నారు.

రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని జనసేనాని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని ఆయన నిలదీశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలు తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని చంద్రబాబు కూడా అంతకుముందు నెల్లూరులో ప్రశ్నించారు. ఇదే లాలూచీ రాజకీయం అన్నారు.

అప్పుడు చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశం: రాహుల్ గాంధీకి మాజీ కాంగ్రెస్ నేత ఝలక్అప్పుడు చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశం: రాహుల్ గాంధీకి మాజీ కాంగ్రెస్ నేత ఝలక్

చంద్రబాబుపై మళ్లీ విజయసాయి ట్వీట్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

Gorantla targets Pawan Kalyan for blaming Chandrababu and nara Lokesh

10 వేల కోట్లతో టూరిజం మిషన్‌, హెలీ టూరిజం, బీచ్‌ టూరిజం అంటూ చంద్రబాబు ఊదరగొట్టేశారని, ఐఎన్ఎస్ విరాట్‌ను కన్వెన్షన్‌ సెంటర్‌గా మారుస్తానని కన్సల్టెంట్లకు కోట్లు ధార పోశారని, రాజమండ్రి రైల్‌ బ్రిడ్జిని టూరిస్టు అట్రాక్షన్‌ చేస్తానని చెప్పారని, మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని పేర్కొన్నారు.

English summary
Telugudesam Party leader Gorantla Buchaiah Choudhary on Tuesday fired at Jana Sena chief Pawan Kalyan for targetting AP CM Chandrababu Naidu and Minister Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X