వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీర్ణించుకోలేకపోతున్నారు, ఏ శిక్షకైనా సిద్ధం: కరణంపై గొట్టిపాటి ఘాటు వ్యాఖ్యలు

అద్దంకిలో 15ఏళ్లుగా ఇలాంటి హత్యలు ఎప్పుడూ జరగలేదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆయన శనివారం ఓ మీడియాతో ఛానల్‌తో వేమవరంలో ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్యకు గురైన విషయ

|
Google Oneindia TeluguNews

ప్రకాశం: అద్దంకిలో 15ఏళ్లుగా ఇలాంటి హత్యలు ఎప్పుడూ జరగలేదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆయన శనివారం ఓ మీడియాతో ఛానల్‌తో వేమవరంలో ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్యకు గురైన విషయంపై మాట్లాడారు. నియోజకవర్గంలో ఏ చిన్న ఘటన జరిగినా తనపై ఆరోపణలు చేయడం ఎమ్మెల్సీ కరణం బలరాం, అతని కుటుంబానికి అలవాటుగా మారిందని అన్నారు.

గొట్టిపాటి వల్లే అల్లర్లు, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం: కరణం సవాల్గొట్టిపాటి వల్లే అల్లర్లు, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం: కరణం సవాల్

ఈ హత్యలకు తనకు సంబంధం లేదని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తాను 2009 ఎన్నికల్లో కూడా గెలిచానని.. ఎప్పుడూ ఇలాంటి హత్య రాజకీయాలకు తాను పాల్పడలేదని చెప్పారు. తనపై నిందలు మోపడం సరికాదని కరణం బలరాంకు హితవు పలికారు.

కుటుంబసభ్యులను కోల్పోయినా ఇలాంటి రాజకీయాలు చేయలేదు: గొట్టిపాటికుటుంబసభ్యులను కోల్పోయినా ఇలాంటి రాజకీయాలు చేయలేదు: గొట్టిపాటి

ఫ్యాక్షన్ సంస్కృతి ఎవరిదో తెలుసు

ఫ్యాక్షన్ సంస్కృతి ఎవరిదో తెలుసు

ఫ్యాక్షన్ బాధితులమే గానీ, తామెప్పుడూ దాడులకు పాల్పడలేదని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ విధమైన సంస్కృతికి ఎవరికుందో అందరికీ తెలుసునని కరణం బలరాంను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. నోటికేదొస్తే అది మాట్లాడటం సరికాదని కరణం బలరాంను ఉద్దేశించి అన్నారు.

ఎన్నో అవమానాలు

ఎన్నో అవమానాలు

టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని.. అయినా అద్దంకిలో టీడీపీ గెలుపు కోసమే తాము అన్నీ భరిస్తున్నామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఏ శిక్షకైనా సిద్ధం

ఏ శిక్షకైనా సిద్ధం

ఈ హత్యల విషయంలో తనపైనా విచారణ జరిపించాలని, తన ప్రేమయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని గొట్టిపాటి రవికుమార్ తేల్చిచెప్పారు. హత్యా రాజకీయాలను తాను గానీ, తనతోపాటు ఉండేవారి గానీ ప్రోత్సహించారని చెప్పారు. తాను అందర్నీ కలుపుకుని టీడీపీ కోసమే పనిచేస్తున్నట్లు తెలిపారు.

జీర్ణించుకోలేకపోతున్నారు..

జీర్ణించుకోలేకపోతున్నారు..

తాను టీడీపీలోకి రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని కరణం బలరాంను ఉద్దేశించి గొట్టిపాటి అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, చిన్న చిన్న విభేదాలున్నా నియోజకవర్గం టీడీపీ నేతలతో కలిసే ముందుకు సాగుతున్నామని తెలిపారు.

వర్గాలంటూ పెద్దది చేస్తున్నారు..

వర్గాలంటూ పెద్దది చేస్తున్నారు..

ఈ హత్యలు జరగడం చాలా బాధాకరమని గొట్టిపాటి అన్నారు. గ్రామంలో చిన్న ఘటన పెద్దదిగా మారి హత్యలకు దారితీసిందని, దీనిని వర్గాలంటూ ఇంకా పెద్ద సమస్యగా మారుస్తున్నారని అన్నారు. ఈ ఘటనలో ఎలాంటి వర్గాలు లేవని అన్నారు. ఇది బాధ్యతగా ఉండాల్సని సమయమని, ఎవరికీ నష్టం జరగకూడదనే తాను చూస్తున్నట్లు తెలిపారు.

కరణంకు హితవు

కరణంకు హితవు

అనుకోని ఘటన జరిగిన సమయంలో సంయమనం పాటించాలని గొట్టిపాటి హితవు పలికారు. రెచ్చగొట్టే ప్రయత్నాలు జరగకూడదని అన్నారు. తనను టీడీపీ నుంచి పంపించాలనే కరణం వర్గం కోరుకుంటోందని గొట్టిపాటి అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు జరగకూడదని, ఇతర గ్రామాలకు ఇలాంటి దాడులు పాకకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా, గొట్టిపాటి అన్నయ్య కిశోర్, తండ్రి కూడా ఫ్యాక్షన్ రాజకీయాల్లోనే హత్యకు గురవడం గమనార్హం.

English summary
Addanki MLA Gottipati Ravi Kumar on Saturday lashed out at TDP MLC Karanam Balaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X