వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌతమిది హత్య కాదా.. ఇంకా మిస్టరీనే: రెండ్రోజుల్లో అన్ని విషయాలు!

అయిదు రోజుల క్రితం పాలకొల్లు మండలం దిగమర్రులో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై పోలీసులు స్పందించారు. నరసాపురానికి చెందిన గౌతమి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

|
Google Oneindia TeluguNews

ఏలూరు: అయిదు రోజుల క్రితం పాలకొల్లు మండలం దిగమర్రులో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై పోలీసులు స్పందించారు. నరసాపురానికి చెందిన గౌతమి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

గౌతమిది హత్య అనేందుకు ఎలాంటి ఆధారాలు ఇప్పటి దాకా దొరకలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో అన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు.

గౌతమి హత్య కేసులో కీలక మలుపు: టీడీపీ నేతతో పెళ్లి ఫొటోలు వెలుగులోకి

ఈ ప్రమాదంలో గౌతమి మృతి చెందగా, ఆమె చెల్లెలు పావని తీవ్రగాయాలకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు ప్రమాద ఘటనగా కేసు నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు.

యువతులు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని కాలువలోకి దూసుకెళ్లిన కారు డ్రైవర్‌తో సహా అందులో ప్రయాణించిన వారంతా పరారవడంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారు విశాఖకు చెందినదిగా తేలడంతో పాలకొల్లు రూరల్ ఎస్సై బృందం అక్కడకు వెళ్లి కారు ట్రావెల్స్‌కు చెందిన యజమాని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

West Godavari police on Tuesday responded on Gouthami's death.

అయితే, నరసాపురానికి చెందిన యువతులను రాత్రి సమయంలో విశాఖకు చెందిన కారు ఢీకొనడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారు ఎవరై ఉంటారనే చర్చ స్థానికంగా సాగింది. గాయపడిన పావని... ఉద్దేశపూర్వకంగానే జరిగిందని చెప్పారు.

తన అక్క గౌతమిని నరసాపురం మండలానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తితో వివాహమైందని, అతని కుటుంబ సభ్యుల ప్రోద్బలంతోనే చంపాలనే బైక్ పైన వెళ్తున్న తమను కారుతో వెంబడించి ఢీకొన్నారన్నారు. కారులో ముగ్గురు కన్నా ఎక్కువమందే ఉన్నారన్నారు.

సోదరితో కలిసి వెళ్తుండగా ప్రమాదం: ఎంబీయే విద్యార్థిని మృతి, అనుమానాలు

దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. పావని అనుమానం వ్యక్తం చేస్తున్న సంబంధికులే ఎటువంటి అనుమానం రాకుండా విశాఖపట్నంకు చెందిన కిరాయి వ్యక్తులతో ఈ కుట్రకు పాల్పడి ఉంటారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.

గౌతమి గ్రూప్‌ - 1కు విశాఖపట్నంలో శిక్షణ పొందుతున్నందున అక్కడ ఏవైనా వివాద సంఘటనలు చోటుచేసుకున్నాయా అనే దిశగా దర్యాఫ్తు చేస్తున్నారు. తమ అదుపులో ఉన్న వారి ద్వారా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

English summary
West Godavari police on Tuesday responded on Gouthami's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X