కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి పదవి రాలేదని శివాజీ కంటతడి, సంచలన నిర్ణయం: వర్మ ఆగ్రహం

ఏపీ కేబినెట్‌లో తనకు స్థానం దక్కకపోవడంతో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేబినెట్లో చోటు దక్కనందుకు ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ కేబినెట్‌లో తనకు స్థానం దక్కకపోవడంతో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేబినెట్లో చోటు దక్కనందుకు ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

పార్టీలో సీనియర్‌ను అయినప్పటికీ తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దగ్గర కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ ఇస్తామని చెప్పిన పార్టీని వీడలేదని చెప్పారు.

తుది శ్వాస వరకు తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల నాటికి తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.

Gouthu Sivaji says he will quit politics in 2019

పిఠాపురం ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు

మంత్రి పదవి రాలేదని అలకబూనిన నేతలపై పిఠాపురం ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాదయాత్ర కారణంగానే మేమంతా ఎమ్మెల్యేలుగా ఉన్నామనే విషయం మరిచిపోవద్దని చెప్పారు.

చంద్రబాబును బలహీనం చేసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దన్నారు. మన విషయాలు బయట చెబితే పరువు పోతుందని ఎలా అయితే బయపడతామో.. పార్టీని కూడా అలా భావించాలన్నారు. కుటుంబం ఎంతో పార్టీ కూడా అంతే అన్నారు. మంత్రి పదవులు మన తలుపు తట్టి అవే వస్తాయని, దాని కోసం దిగులు అవసరం లేదన్నారు.

English summary
Srikakulam district Palasa MLA Gouthu Sivaji on Monday said that he will quit politics in 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X