వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటికి నోటీసులు, డ్రోన్లు ఎగరేయడం తప్ప వరద నివారణలో ప్రభుత్వం వైఫల్యం : చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

వరదలపై రాజకీయాలు చేయడం మినహ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ సంధర్భంగా ఏపిలో బీభత్సం సృష్టించిన వరదలపై ప్రభుత్వానికి మూడు పేజీల లేఖను చంద్రబాబు నాయుడు రాశారు. ఈనేపథ్యంలోనే తన ఇంటికి నోటీసులు పంపడంతోపాటు, డ్రోన్ల ఎగవేయడం తప్ప ప్రజలకు చేసిందేమి లేదని లేఖలో పేర్కోన్నారు.

తప్పుడు విధానాల వల్లే ఆర్థిక మందగమనం: మోడీ ప్రభుత్వాన్ని ఏకేసిన మన్మోహన్తప్పుడు విధానాల వల్లే ఆర్థిక మందగమనం: మోడీ ప్రభుత్వాన్ని ఏకేసిన మన్మోహన్

ఇటివల ఏపిని ముంచెత్తిన వరద నష్టంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈనేథ్యంలోనే ప్రభుత్వం వరద నివారణ చర్యలు చేపట్టడడంలో వైఫల్యం చెందిందని లేఖలో పేర్కోన్నారు. వరద సమయంలో ప్రజలను ఆదుకోవడంతోపాటు, వారికి పునరావసం కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని తెలిపారు. భాదితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఉద్దేశ్వపూర్వకంగానే నిర్లక్ష్యం వహించిదని అన్నారు. వర్ష నమోదుపై వావతరణ శాఖ హెచ్చరిస్తున్నా పట్టించుకోలేదని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పు బట్టారు.

government failed to take precautionary measures on the floods.

ఈనేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజీలో నీటీని ఒక్కసారిగా 2.5 లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో లంక గ్రామాలు నీట మునిగాయని పేర్కోన్న ఆయన ముందే ప్రకాశం బ్యారేజీలో నీటీమట్టం తగ్గించకుండా తప్పు చేశారని అన్నారు. దీంతో లంక గ్రామాల ప్రజల జీవితాలతో ఆడుకున్నారని అన్నారు. ఇక మరోవైపు రాజధానికి ముంపు ఉందని ఉద్దేశ్యపూర్వకంగానే ప్రచారం చేసిన వైసీపీ, తన ఇంటికి నోటీసులు అంటించడం డ్రోన్లు ఎగరేయడం మినహా వరద నివారణకు ఎలాంటీ ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

English summary
TDP chief Chandrababu Naidu criticized the government for failing to take precautionary measures on the floods. On this occasion, Chandrababu Naidu wrote a three-page letter to the government on the floods that had created panic in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X