వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ మాటలకు పెట్టిన బడ్జెట్‌కు పోంతన లేదు... చంద్రబాబు నాయుడు

|
Google Oneindia TeluguNews

ముందుచూపులేని బడ్జెట్‌ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు . వైసీపీ మాటలకు, చేతలకు పొంతన లేదనడానికి బడ్జెట్‌ కేటాయింపులే నిదర్శనమని విమర్శించారు. పార్టీ నేతలు శ్వేతపత్రంలో ఒకలా చెబుతూ.. బడ్జెట్‌లో మరోలా పేర్కొన్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే 2014లో తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రూ.6 వేలు ఎక్కువగా ఉందని నేడు అది రూ.38 వేలు ఎక్కువ కావడం తెదేపా ప్రభుత్వ ఘనత కాదా? అని ప్రశ్నించారు.

Recommended Video

అన్ని హామీలు అమలు చేశానన్న బాబు పై మండిపడ్డ జగన్
government has introduced an un precedented budget:Chandrababu Naidu

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో 49వేల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వ లెక్కలే చెప్పాయని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రాజెక్టులకు కోతలు పెట్టి ప్రగతికి గండికొట్టారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు బడ్జెట్‌ కేటాయింపుల్లో 22శాతం కోత పెట్టారన్నారు. పొరుగు రాష్ట్రంలో నీళ్లు పారించేందుకే దృష్టిపెట్టారని విమర్శలు గుప్పించారు. ఇక సున్నా వడ్డీ రుణాలకు 4వేల కోట్ల రుపాయలు అవసరమైతే రూ.100 కోట్లే ఇచ్చారన్నారు. బీసీల సంక్షేమానికి నిధుల్లో కోత పెట్టారని.. 139 కార్పొరేషన్లు అని చెప్పి.. వాటికి కేటాయింపులపైనా స్పష్టత ఇవ్వలేదన్నారు.

English summary
tdp chief and Opposition Leader Chandrababu Naidu responded to the budget presented by the state government in the legislature. he commented that the government has introduced an un precedented budget.ycp words are not compatible with the budget allocations. he criticized the budget
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X