వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూతూ మంత్రంగా పోలవరం రివర్స్ టెండరింగ్‌.. సుజనాచౌదరి ఫైర్

|
Google Oneindia TeluguNews

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ ఎంపీ, సుజనాచౌదరి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ పై ఆయన పలు విమర్శలు చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం అయ్యో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌లో సరైన నిబంధనలు పాటించారా అంటూ ఆయన ప్రశ్నించారు. గతంలో నిర్వహించిన పోలవరం టెండర్లలో ఎల్‌2గా వచ్చిన కంపనీకే ఈ సారి టెండరు దక్కడం వెనక ఉన్న మర్మమేటని పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

లేడీ కాదు కిలేడీ.. విద్యార్థినుల ఫోటోలు తీసి... పోర్న్ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి....లేడీ కాదు కిలేడీ.. విద్యార్థినుల ఫోటోలు తీసి... పోర్న్ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి....

పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ఎంత వ్యయం తగ్గింది...?

పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ఎంత వ్యయం తగ్గింది...?

ఇక రివర్స్ టెండరింగ్ ద్వారా వ్యయాన్ని తగ్గించామని వైసీపీ నేతలు తూతూ మంత్రపు లెక్కలు చెబుతున్నారని విమర్శించిన ఆయన, ఏమేరకు వ్యయాన్ని తగ్గించారో స్పష్టంగా చెప్పాలని అన్నారు.ఇప్పటికే ప్రాజెక్టు పనులు 67 శాతం పూర్తయ్యాయని చెబుతున్న ప్రభుత్వం ఇంకా ఏయో పనులు పెండింగ్‌లో ఉన్నాయో అనే అంశాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరముందని అన్నారు.

మరో మూడేళ్ల ఆలస్యం

మరో మూడేళ్ల ఆలస్యం

గత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ప్రాజెక్టు పూర్తయ్యేదని వివరించిన సుజనాచౌదరీ ప్రస్థుత ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల మరో మూడేళ్లపాటు నిర్మాణం ఆలస్యమయ్యో అవకాశాలు ఉన్నాయని అన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయో ప్రమాదం కూడా ఉందని ఆయన హెచ్చరించారుమరోవైపు గత వైఎస్ హాయంలో భూమి సేకరణ పూర్తయితే ఇంత సాగదీత ఉండేది కాదని ఆయన తెలిపారు. ఇక జగన్ తీరు వల్ల వల్ల ఐదారు వేల కోట్ల రుపాయాలు నష్టపోయో ప్రమాదం ఉందని అంచనా వేశారు.

పీపీఏల రద్దుతో రాష్ట్రానికి చెడ్డపేరు...

పీపీఏల రద్దుతో రాష్ట్రానికి చెడ్డపేరు...

ఇక పీపీఏల రద్దులో కూడ దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పీపీఏల విషయంలో ప్రభుత్వం సరైనా విధానంలో ముందుకు పోవడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విధానాలతో ఇప్పటికే బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని చెప్పిన ఆయన భవిష్యత్ పెట్టుబడులు కూడ ఆగిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

సానుభూతి వస్తుందని చంద్రబాబు చూస్తున్నారు.

సానుభూతి వస్తుందని చంద్రబాబు చూస్తున్నారు.

ఇక చంద్రబాబు నాయుడుపై కూడ ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇంటిని పడగొట్టడడం ద్వారా ఆయన సానూభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు, చంద్రబాబు అద్దెకు ఉన్నప్పుడు ఖాళీ చేయవచ్చు కదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో అధికార ప్రతిపక్షాలు దొందు దొందే అన్నారు. అందుకే చంద్రబాబు ఇంటి చుట్టే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

English summary
Bjp rajya sabha mp sujana chowdary has demanded that the government has to release white paper on polavaram project progress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X