వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో పథకానికి పేరు మార్పు: చంద్రన్నకు బదులుగా..! కానుక మొత్తం పెంపు?

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ పథకాల పేర్ల మార్పు కొనసాగుతోంది. తాజాగా మరో పథకానికి పేరును మార్చారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చంద్రన్న పెళ్లి కానుక పేరును మార్చారు. దీన్ని వైఎస్ఆర్ పెళ్లి కానుక కొత్త పేరు పెట్టారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోమవారం జీవో జారీ చేశారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి చేయడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచ అందేలా రూపొందించిన పథకం ఇది.

ఆర్థికంగా పెళ్లిళ్ల సమయంలో చేయూత అందించాలనే ఉద్దేశ్యంతో 2018లో చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, భవన నిర్మాణ కార్మికులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఆయా కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి సమయంలో ప్రభుత్వం తరఫున కానుకలు అందించాలని నిర్ణయించారు. ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతలను సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించారు.

Government hereby rename the Chandranna Pelli Kaanuka as YSR Pelli Kaanuka

పెళ్లి కానుకల రూపంలో ప్రభుత్వం అందించే నగదు మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు 50 వేల రూపాయలు, కులాంతర వివాహాలు చేసుకుంటే 75 వేల రూపాయలు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలకు 35 వేల రూపాయలు, భవన నిర్మాణ కార్మికులకు 25 వేల రూపాయలు, వికలాంగులకు మరో 75 వేల రూపాయలతో పాటు వికలాంగులు ఇతరులను వివాహం చేసుకుంటే వారికి లక్ష రూపాయలు పెళ్లి కానుకల రూపంలో అందిస్తారు. ఈ పథకానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పేరు పెట్టుకున్నారు.

జవాన్లపై షాకింగ్ కామెంట్స్: యువతిపై క్రిమినల్ కేసు నమోదు: వివరణ ఇచ్చుకున్న సైన్యంజవాన్లపై షాకింగ్ కామెంట్స్: యువతిపై క్రిమినల్ కేసు నమోదు: వివరణ ఇచ్చుకున్న సైన్యం

ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ పథకం పేరును కూడా మార్చేశారు అధికారులు. చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరును వైఎస్సార్ పెళ్లి కానుకగా మార్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఈ పథకానికి పెట్టారు. ఇప్పటిదాకా ఈ పథకం కింద లబ్దిదారులకు అందజేస్తోన్న మొత్తాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని సాంఘిక సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కో వర్గానికి పెళ్లి కానుక రూపంలో అందజేసే మొత్తంలో 5000 రూపాయల వరకు పెంపుదల చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచనప్రాయంగా వెల్లడిస్తున్నారు.

English summary
Government of Andhra Pradesh hereby rename the “Chandranna Pelli Kaanuka” as “YSR Pelli Kaanuka”. The Social Welfare, Tribal Welfare, Backward Classes, Minorities welfare department should follow the instructions says Social Welfare Department Muddada Ravichandra says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X