• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐఎఎస్ అధికారి చేతికి ఆర్టీసీ పగ్గాలు: సుధీర్ బాబు బదిలీ: విలీనం దిశగా తొలి అడుగేనా?

|

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా తొలి అడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటిదాకా ఐపీఎస్ అధికారి సారథ్యం వహిస్తూ వచ్చిన ఆర్టీసీ బాధ్యతలను సీనియర్ ఐఎఎస్ అధికారి చేతికి అప్పగించింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తోన్న ఎంటీ కృష్ణబాబును ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కృష్ణబాబుకు పూర్తి స్థాయి అదనపు బాధ్యత (ఎఫ్ఎసీ)లను అప్పగించింది. ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీ సురేంద్ర బాబును బదిలీ చేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సరిహద్దుల్లో పాక్ సరికొత్త కుట్ర: డ్రోన్ల ద్వారా మారణాయుధాలు తరలింపు: 26/11 తరహా దాడులు!

ఐఎఎస్ అధికారి చేతికి ఆర్టీసీ పగ్గాలు..

ఐఎఎస్ అధికారి చేతికి ఆర్టీసీ పగ్గాలు..

ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నియమితులు కావడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. ఆర్టీసీ ఆవిర్భవించిన తొలి రోజుల్లో మాత్రమే ఐఎఎస్ అధికారి ఆ సంస్థకు వీసీ అండ్ ఎండీగా కొనసాగారు. అనంతరం ఐపీఎస్ అధికారిని ఈ స్థానంలో నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటి వరకు కూడా ఐపీఎస్ అధికారే ఎండీగా కొనసాగారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత హోదాలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలల వ్యవధిలోనే దీన్ని ఆచరణలో పెట్టారు.

సిఫారసుల్లో మార్పులు లేకుండా అమలు..

సిఫారసుల్లో మార్పులు లేకుండా అమలు..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ మాజీ ఎండీ ఆంజనేయ రెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ నెల 3వ తేదీన ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయవచ్చని ఆ కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసుల్లో ఏ ఒక్క మార్పు కూడా చేయలేదు ప్రభుత్వం. ఇచ్చిన సిఫారసులను ఇచ్చినట్టే అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో విలీనం దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో కొనసాగిన ఆర్టీసీ బాధ్యతలను ఐఎఎస్ చేతికి అప్పగించడంతో శ్రీకారం చుట్టినట్టుగా భావించ వచ్చని ఆర్టీసీ కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రజా రవాణా శాఖగా నామకరణం..

ప్రజా రవాణా శాఖగా నామకరణం..

ప్రభుత్వంలో విలీనమైన అనంతరం ఆర్టీసీ పేరును మారుస్తామని, దీన్ని ప్రజా రవాణాశాఖగా నామకరణం చేస్తామంటూ ఆ శాఖ మంత్రి పేర్ని నాని ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావడంతో ఆ సంస్థకు గుదిబండగా మారిన అప్పులు, నష్టాలు.. ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలన్నీ ప్రభుత్వపరమౌతాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేలకు పైగా బస్సులు, 128 డిపోలు, ఆర్టీసీకి ఉన్న స్థిర, చరాస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆవిర్భవిస్తారు. ఇతర శాఖల ఉద్యోగులతో సమానంగా వారికి జీతబత్యాలు, ఇతరత్రా అలవెన్సులను చెల్లిస్తుంది ప్రభుత్వం. దీనితో పాటు పదవీ విరమణ వయస్సు కూడా 58 నుంచి 60 సంవత్సరాలకు పెరుగుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
APSRTC Vice Chairman and Managing Director NV Surendra Babu is transferred. Transport, Road and Buildings Department of Andhra Pradesh Principal Secretary MT Krishna Babu is placed in Full Additional Charge (FAC) of of the post of VC and MD of APSRTC. Chief Secretary of Government of Andhra Pradesh LV Subrahmanyan issue the Orders on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more