వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సన్ రైజ్ స్టేట్ కాదిక: యూత్ టాలెంట్ కు వైఎస్ జగన్ పరీక్ష:

|
Google Oneindia TeluguNews

అమరావతి: సాధారణంగా ప్రభుత్వం మారిన తరువాత పథకాల పేర్లు మారిపోతుంటాయి. ఇది సహజంగా చోటు చేసుకునే రాజకీయ ప్రక్రియే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. పారిశ్రామిక రంగాన్ని పురోగమింపజేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సన్ రైజ్ స్టేట్ అనే ఓ బ్రాండ్ నేమ్ ఉండేది. విభజన తరువాత 13 జిల్లాలతో ఏర్పాటైనందున.. అప్పడే ఉదయిస్తోన్న రాష్ట్రం అనే అర్థం వచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం ఈ బ్రాండ్ నేమ్ ను డిజైన్ చేయించింది.

ఆ అవినీతి మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ఆ అవినీతి మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్

పరిశ్రమల శాఖకు బ్రాండ్ నేమ్ కోసం..

పరిశ్రమల శాఖకు బ్రాండ్ నేమ్ కోసం..

ఈ బ్రాండ్ నేమ్ డిజైన్ కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎంత మొత్తానని ఖర్చు పెట్టిందనేది పక్కన పెడితే.. తాజాగా వైఎస్ జగన్ సర్కార్ కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది. కాకపోతే- ఓ చిన్న ట్విస్ట్. బ్రాండ్ నేమ్, లోగో, ట్యాగ్ లైన్ డిజైన్లను రాష్ట్ర ప్రజలకే వదిలేశారు. బ్రాండ్ నేమ్ ను, లోగోను రూపొందించే బాధ్యత ప్రజలకే ఇచ్చారు. జనాల టాలెంట్ ఓ పెద్ద పరీక్షే పెట్టారాయన. ఉచితంగా కాదు గానీ.. అత్యుత్తమ మూడు ఎంట్రీలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఎంట్రీలను పంపించడానికి చివరి తేదీ ఈ నెల 28.

 పరిశ్రమల శాఖ కార్యకలాపాల్లో బ్రాండ్ నేమ్ వినియోగం..

పరిశ్రమల శాఖ కార్యకలాపాల్లో బ్రాండ్ నేమ్ వినియోగం..

ఆంధ్రప్రదేశ్ బ్రాండథాన్ పేరుతో తాజాగా ఈ కాంపిటిషన్ ను తెర లేపింది ఏపీ ప్రభుత్వం. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన మంత్రిత్వ శాఖ ఈ పోటీలను పర్యవేక్షించబోతోంది. ఈ బ్రాండ్ నేమ్ కావాల్సింది ఆ శాఖకే. ప్రజలు రూపొందించి, ప్రభుత్వానికి అందజేసే బ్రాండ్ నేమ్ తోనే పరిశ్రమల శాఖ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. పెట్టుబడులను ఆకర్షించడానికి, విదేశీ పర్యటనల సందర్భంగా దీన్నే అధికారిక చిహ్నంగా వినియోగిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించే అవకాశం ఉన్నందున.. పెద్ద ఎత్తున ఎంట్రీలు వస్తాయని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు.

సన్ రైజ్ స్టేట్ కు బదులుగా..

సన్ రైజ్ స్టేట్ కు బదులుగా..

ఇదివరకు 13 జిల్లాలతో ఏర్పాటైన రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం ‘సన్ రైజ్ స్టేట్' అని పేరు పెట్టుకుంది. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ కార్యకలాపాలు దాదాపుగా ఆ పేరు మీదే కొనసాగాయి. అప్పట్లో రాష్ట్రంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో ఈ బ్రాండ్ నేమ్ విస్తృతంగా వినియోగించిన విషయం తెలిసిందే. దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలు, అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో సన్ రైజ్ స్టేట్ లోగో కనిపించింది. దానిక స్థానంలో ప్రజలు రూపొందించే సరి కొత్త లోగో తెర మీదికి రానుంది. అదేమిటన్నది తెలియడానికి ఇంకొన్నాళ్ల పాటు వేచి చూడాల్సిందే.

English summary
Government of Andhra Pradesh Industries and Infrastructure department announced a Brandathan. Brand Name and Logo and Tagline design competition for Industries department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X