శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాదయాత్ర హామీ కార్యరూపం: బేడ/బుడగ జంగమల కులంపై వైఎస్ జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో కులం లేని సామాజిక వర్గం అంటూ ఏదైానా ఉందంటే అది బేడ లేదా బుడగ జంగమలే. సంచార జాతులుగా ముద్రపడిన బుడగ జంగమలకు ఏ సామాజిక వర్గం కిందికీ రారు. ప్రతి సామాజిక వర్గానికి ఏదో ఓ కులం ఉంటుంది. దాని ఆధారంగా వారికి బీసీ, ఎస్సీ, ఎస్టీల కులధృవీకరణ పత్రాలను జారీ చేస్తుంటారు అధికారులు. బుడగ జంగాలు ఏ కులం కిందకి వస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బుడగ జంగమలకు ఏ కేటగిరి కింద కుల ధృవీకరణ పత్రాలను జారీ చేస్తారనేది కొరుకుడు పడని ప్రశ్న. ఊరూరా తిరుగుతూ సంచార జీవితం గడుపుతున్న బుడగ జంగమలను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి గల సాధ్యసాధ్యాలను పరిశీలించడానికి ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జేసీ శర్మకు ఈ కమిషన్ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

కులం లేని సామాజిక వర్గంగా..

కులం లేని సామాజిక వర్గంగా..

బేడ/బుడగ జంగాల కుటుంబాలకు చెందిన వారు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో నివసిస్తున్నారు. రాయలసీమలో ప్రత్యేకించి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వారి సంఖ్య ఎక్కువ. రాయలసీమలో వారిని జంగమదేవర్లు, జంగమయిలు, జంగాలుగా పిలుస్తుంటారు. తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. బుడగ జంగమ కుటుంబాల ప్రధాన వృత్తి వేట. వారిది సంచార జీవన శైలి. కర్నూలు, అనంతపురం సహా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో వారు స్థిరనివాసాన్ని ఏర్పరచుకున్నారు. క్రమంగా దాదాపు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలకూ విస్తరించారు. సంచార జీవన విధానాన్ని విడనాడి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉపాధి అవకాశాలను వెదుక్కుంటున్నారు. సంచార జాతులకు చెందిన వారు కావడం వల్ల బుడగ జంగమలకు ఓ కులం అంటూ లేకపోయింది.

టీచర్స్ విస్కీ తాగుతూ టీచర్స్ డే సెలబ్రేషన్సా?: ఉపాధ్యాయులపై రామ్ గోపాల్ వర్మ సెటైర్లుటీచర్స్ విస్కీ తాగుతూ టీచర్స్ డే సెలబ్రేషన్సా?: ఉపాధ్యాయులపై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు..

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు..

తాము అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే బేడ, బుడగ జంగాలను షెడ్యూల్ కులంలో చేర్చేలా చర్యలు తీసుకుంటామని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా సుళ్లూరు పేటలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో బుడగ జంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనను కలిశారు. తమ ఇబ్బందులను వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే తాజా జీవో వెలువడిందని అంటున్నారు అధికారులు.

ఏ కేటగిరీలోనూ లేని కమ్యూనిటీ..

ఏ కేటగిరీలోనూ లేని కమ్యూనిటీ..


వారికి ఏ కేటగిరి కింద కుల ధృవీకరణ సర్టిఫికెట్ ఇస్తారనే విషయం కూడా అధికారులకు తెలియదు. ఒకవేళ అలాంటి దరఖాస్తులేవైనా జారీ చేసి ఉంటే అవి ఖచ్చితంగా నకిలీ లేదా తప్పుడు ధృవీకరణ పత్రాలే అయి ఉంటాయని స్వయంగా బుడగ జంగమ సామాజిక వర్గ నాయకులే చెబుతున్నారు. బుడగ జంగమలను ఏదైనా ఓ కులంలో చేర్చాలంటూ ఇదివరకు పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇదే విషయం కొద్దిరోజుల కిందటే అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, అర్థర్, తిప్పేస్వామి ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు. ఈ ముగ్గురూ కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం.

తెలంగాణలో ఎస్సీలుగా గుర్తించినా..

తెలంగాణలో ఎస్సీలుగా గుర్తించినా..

కుల ధృవీకరణ పత్రాలు లేకపోవటంతో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు వివిధ పథకాలను కూడా పొందలేకపోతున్నారని వారు సభలో ప్రస్తావించారు. 2014లో రాష్ట్ర విడిపోయిన తరువాత ఈ బుడగ జంగాలను కులాల జాబితా నుంచి కేంద్రం తొలగించిందని అప్పట్లో ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. బుడగ జంగమ కుటుంబాలను రాజ్యాంగంలోని 341 షెడ్యూలు ప్రకారం, 1950 సంవత్సరంలో రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డరు ప్రకారం షెడ్యూల్డు కులానికి చెందిన వారిగా గుర్తించారు. అది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమతం చేశారు. తెలంగాణ మాత్రమే నివసించే బుడగ జంగమలకు ఎస్సీలుగా గుర్తించారు. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో నివసించే బుడగ జంగమలను ఎస్సీలుగా గుర్తించలేదు. 2008 జూన్ 17వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సాంఘిక సంక్షేమ శాఖ 144 జీవోను విడుదల చేసింది. ఈ 144 జీవో ప్రకారం.. బుడగ జంగమలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని ఈ జీవోలో పేర్కొన్నారు. అప్పటి నుంచి బుడగ జంగమలకు కష్టాలు మొదలయ్యాయి.

దీనికి చెక్ పెడుతూ..

దీనికి చెక్ పెడుతూ..

బేడ/బుడగ జంగమలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు చెక్ పెట్టేలా వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. బుడగ జంగమలను ఎస్సీ జాబితాలో చేర్చేలా అడుగు వేసింది. దీనికి గల సాధ్యసాధ్యాలను పరిశీలించడానికి జేసీ శర్మ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. దీనితో పాటు శ్రీకాకుళం జిల్లాకు మాత్రమే పరిమితమైన బెంథో ఒరియా సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ గా గుర్తించేలా ఈ కమిషన్ విధి విధానాలను రూపొందించారు.

English summary
Government of Andhra Pradesh Appointed Retired IAS Officer JC Sharma as Head of the One Man Commission to resolve the issues of Inclusion of Beda/Budga Jangama community people under Scheduled Castes category and Issuance of ST-Bentho Oriya community certificates in the Srikakulam District’ and other Scheduled Caste.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X