వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ జెరూసలేం పర్యటన ఖర్చు ఎంతో తెలుసా? ఎంత వ్యక్తిగత టూరే అయినా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

జగన్ జెరూసలేం పర్యటన ఖర్చు 22,52,000 | AP Govt Released CM Jagn Expenditure For His Jerusalem Tour

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో జెరూసలేం పర్యటనకు బయలుదేరి వెళ్లబోతున్నారు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జెరూసలేం వెళ్లనున్నారు. జెరూసలేంను సందర్శించడం వైఎస్ కుటుంబానికి సెంటిమెంట్. ముఖ్యమంత్రిగా తన విదేశీ పర్యటనలను జెరూసలేం నుంచే శ్రీకారం చుట్టడం శుభసూచకంగా భావిస్తున్నారు వైఎస్ జగన్. తన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిళ, ఆమె భర్త అనిల్ తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ జెరూసలేం వెళ్తారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి హోదాలో జెరూసలేంను సందర్శించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జెరూసలేంకు వెళ్లొచ్చిన జగన్.. ఈ సారి ముఖ్యమంత్రి హోదాలో ఆ దేశ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం. సొంత ఖర్చులతో వైఎస్ జగన్ జెరూసలేం వెళ్లనున్నారు.

Government released AP Chief Minister expenditure for his Jerusalem tour

వైఎస్ జగన్ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమే అయినప్పటికీ.. భద్రతా వ్యవహారాల ఖర్చు 22, 52, 000 రూపాయలు. ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు. ఇజ్రాయెల్‌లో ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్ను పర్యవేక్షిస్తోన్న ట్రిపుల్ ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. డాలర్ల రూపంలో ఆ సంస్థకు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రొటోకాల్ ప్రకారం.. జగన్ వెంట వ్యక్తిగత సిబ్బందితో పాటు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ సెంథిల్ కుమార్, సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి జోషి వెళ్లనున్నారు.

English summary
Government of Andhra Pradesh Ministry Finance was released Rs. 22,50,000 for Chief Minister of YS Jagan Mohan Reddy's Jerusalem tour. This expenditure should utilize only for YS Jagan and his family security purpose. Principle Secretary of Finance Ministry released the GO related to this Amount.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X