• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కార్పొరేట్ స్కూళ్లకే...సవాలు విసురుతున్న ఓ పల్లెటూరి బడి..ప్రభుత్వ సంస్థ గొప్పతనం

|

అసలు సర్కారీ బడి అంటే ఎలా ఉంటుంది...మొండిగోడలు...పెచ్చులూడే భవనాలు...అరకొర సదుపాయాలు...వసతుల లేమి...ఉపాధ్యాయుల లేమి...ఇవీ సాధారణంగా ఏ ప్రభుత్వ పాఠశాలను చూసినా కనిపించే సమస్యలు...కానీ వీటన్నింటికీ భిన్నంగా ఒక పల్లెటూరులోని పాఠశాల మాత్రం సకల సౌకర్యాలతో...సమస్త సదుపాయాలతో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకే సవాలు విసురుతోంది.

ఈ గ్రామీణ పాఠశాలను చూసిన వారెవరైనా ఇది సర్కారీ బడి అంటే ఎంత చెప్పినా నమ్మరు...కారణం ముందే చెప్పినట్లు ఆ స్కూల్ కి ఉండే హంగులు
కార్పొరేట్ సంస్థల్లో కూడా ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇలా ఒక పల్లెటూరి పాఠశాలను మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దిన ఘనత ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థదే. ఇంతకీ ఈ సూపర్ స్కూల్ ఎక్కడుందో...దీని ప్రత్యేకత లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

కడప జిల్లాలో...మంగంపేటలోనే...ఇక్కడ ఎందుకంటే...

కడప జిల్లాలో...మంగంపేటలోనే...ఇక్కడ ఎందుకంటే...

ఈ మోడల్ స్కూల్ కడప జిల్లా మంగంపేట గ్రామంలో ఉంది. మనిషి తొలి అడుగు విద్యతోనే పడాలి...అతడిలోని అత్యున్నత సామర్ధ్యాన్నివెలికి తీసేదే అసలైన విద్య. అందుకు సాయం చేస్తే అక్కడి ప్రజలకు అంతకన్నా మేలు చేసిన వాళ్లు మరొకరు ఉండరు"...అనే యోచనతో ఈ మంగంపేటలో ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) స్థాపించిన విద్యాసంస్థ ఎపిలోనే మిగతా పాఠశాలలకు ఓ రోల్ మోడల్ లా మారింది. కడపజిల్లా మంగంపేట ముగ్గురాయి గనులకు ప్రసిద్ధి అనే సంగతి తెలిసిందే. అందువల్ల ఈ ప్రాంతంలో వేలాదిమంది ఏపీఎండీసీకి చెందిన కార్మికులు, సిబ్బంది ఈ ముగ్గురాతి గనుల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాము లబ్ధిపొందుతున్న ఈ ప్రాంతానికి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన చేసిన ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ది సంస్థ ఇక్కడ మంచి స్కూల్ పెట్టడం కంటే మంచి పని ఏముంటుంది అని భావించింది.

అనుకున్నదే తడవు...ఎన్నో ప్రత్యేకతలు

అనుకున్నదే తడవు...ఎన్నో ప్రత్యేకతలు

అనుకున్నదే తడవుగా ఇక్కడ మంచి విద్యాలయం స్థాపించాలని, అది కూడా మిగతా స్కూల్స్ కు ఆదర్శంగా ఉండాలని యోచించిన ఏపీఎండీసీ ఆ దిశలోనే నిర్మాణం చేపట్టింది. మూడెకరాల విశాల ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య దాదాపు ఐదున్నర కోట్ల రూపాయల వ్యయంతో ఈ పాఠశాలను నిర్మించారు. మూడు అంతస్తులుగా కట్టిన ఈ పాఠశాల భవనంలో...తరగతి గదుల్ని ప్రత్యేకంగా చిన్నారులను ఎంతగానో ఆకట్టుకునేలా వివిధ రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అంతేకాదు కేవలం చూపులకే అందంగా ఉండటం కాకుండా విద్యాభ్యాసానికి సంబంధించి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉండే విధంగా క్లాస్ రూమ్ లను రూపుదిద్దారు. ఈ క్లాస్ రూముల్లో పిల్లల పాఠ్యాంశాలకు సంబంధించిన వివిధ రకాల విజ్ఞానదాయకమైన చార్టులను వేలాడదీశారు. చిన్నప్పటి నుంచే చిన్నారులకు కంప్యూటర్‌ అవగాహన కలిగేలా సుందరమైన, సౌకర్యవంతమైన కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు నచ్చిన కథలు చదువుకునేందుకూ, వివిధ విషయాల పట్ల అవగాన పెంచుకునేందుకూ సాయపడేలా గ్రంథాలయాన్ని నెలకొల్పారు. పరిశుభ్రమైన శౌచాలయాలూ, శుద్ధమైన తాగునీరూ అందుబాటులో ఉంచారు.

మోడరన్ స్కూల్...మోడల్ సిస్టమ్...

మోడరన్ స్కూల్...మోడల్ సిస్టమ్...

చిన్నతరగతుల పిల్లలుకు ఒక టీచర్ విధానం కంటే ఇద్దరు టీచర్ల విధానం అనువుగా ఉంటుందని...పాఠం చెప్పేప్పుడు ప్రతి క్లాస్ కు ఇద్దరు టీచర్లు ఉండేలా నూతన విధానం అమలు చేస్తున్నారు. అంతేకాదు ఎల్‌కేజీ, యూకేజీల పిల్లల్ని నలుగురేసి చొప్పున గ్రూపులు గ్రూపులుగా కూర్చోబెడతారు. ఒక టీచర్‌ బోర్డు మీద పాఠం చెబుతుంటే మరొకరు ఈ పిల్లల దగ్గర నిలబడి చెప్పే పాఠం వాళ్లకు అర్థమవుతున్నదీ లేనిదీ పరిశీలిస్తూ అర్థం చేసుకునేందుకు వాళ్లకు సాయపడతారు. అంతేకాదు బోధనను పర్యవేక్షించేందుకు తరగతి గదుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్కూల్ లో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది ఎల్లప్పుడూ తెలుసుకోవడం ద్వారా ఉపాధ్యాయుల బోధన తీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సలహాలూ సూచనలూ ఇస్తుంటారు. అన్నింటికీ మించి పిల్లలకు మోత బరువు లేకుండా పుస్తకాల బ్యాగును పాఠశాలలో ఉంచేసే విధానాన్ని అనుసరిస్తున్నారు.

పిల్లలకు ఆటపాటలు...బడికి పేరు ప్రఖ్యాతులు...కార్మికుల పిల్లలకే తొలి ప్రాధాన్యం...

పిల్లలకు ఆటపాటలు...బడికి పేరు ప్రఖ్యాతులు...కార్మికుల పిల్లలకే తొలి ప్రాధాన్యం...

కేవలం చదువు విషయమే శ్రద్ద తీసుకోవడం కాకుండా పిల్లలకు ఆటపాటలు ముఖ్యమని భావించిన నిర్వాహకులు స్కూల్లో విశాలమైన మైదానంతో పాటు ఆటల్లో నైపుణ్యాన్నిపెంచేందుకు నిపుణుడైన వ్యాయామ ఉపాధ్యాయుడిని పీఈటీగా నియమించారు. అంతేకాదు పిల్లల ఆసక్తిని బట్టి సంగీతం, ఆర్ట్‌, డాన్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. మొత్తంగా పాఠశాల నిర్వహణకు ఏడాదికి కోటి రూపాయల్ని వెచ్చిస్తోంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 504 మంది పిల్లలున్నారు. ఇందులో చేర్చుకునేందుకు సంస్థ కార్మికుల పిల్లలకే మొదటి ప్రాధాన్యత కాగా, చుట్టుపక్కల ఊళ్ల పిల్లలకు తరువాత ప్రాధాన్యం ఇస్తున్నారు.

అందుకే ఈ స్కూల్...కార్పొరేట్ స్కూల్స్ కి రోల్ మోడల్

అందుకే ఈ స్కూల్...కార్పొరేట్ స్కూల్స్ కి రోల్ మోడల్

ఇలా అన్నిజాగ్రత్తలూ తీసుకొని అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పబడిన ఈ స్కూల్ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోందనడంలో ఎలాంటి సందేహం పెట్టుకోనక్కరలేదు. అందుకే ఈ పాఠశాల విద్యార్థులు చుట్టుపక్కల జరిగే ఏ పోటీల్లో అయినా బహుమతులు కొల్లగొడుతున్నారు. అందుకే ఈ స్కూల్ ను చూసిన కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులే తమ పిల్లలకు ఇంత మంచి స్కూల్ అందుబాటులో లేదని అంటున్నారంటే ఈ స్కూల్ ప్రమాణాలు అర్థం చేసుకోవచ్చు.

English summary
This is the amazing story of a Governament department who has transformed the face of a government school in an extremely remote village in Cuddapah district. Such is this department passion and commitment to the children of the village. Mangampeta, This barytes mines village now attracts all because of this model school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X