వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు: ఉపాధ్యాయుడి సస్పెన్షన్....

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: సోషల్ మీడియానే కదా అని మనకు నచ్చిందల్లా లైక్ లు కొట్టడమో....కామెంట్లు,షేర్లు చెయ్యడమో...పోస్టులు పెట్టడమో చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త...అందులోను ప్రభుత్వ ఉద్యోగులైతే ఆన్ లైన్ లో మీరు పెట్టే పోస్టుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి...అలా ఉండకపోతే ఏం జరుగుతుంది అనే కదా మీ సందేహం...ఏంజరగచ్చో ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఉదంతం తేటతెల్లం చేస్తోంది...

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోస్టుల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గవర్నమెంట్ టీచర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మాస్టారు గవర్నమెంటుకు వ్యతిరేకంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం చేసేవాడట..తాను ప్రభుత్వ ఉద్యోగి అయివుండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా వల్గర్ పోస్టులు పెట్టడంపై చిర్రెత్తుకొచ్చిన తోటి ఉపాధ్యాయులు ఇతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఈ మాస్టారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపగా ఆధారాలతో సహా దొరికిపోయాడు..అంతే సస్పెన్షన్ వేటు పడింది.

Government teacher suspended over anti-government comments on social media

ఎవరీ మాస్టారు?...
ఈ మాస్టారు పేరు మంచింశెట్టి శ్రీనివాస...ఈయన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లిలోని బంగారంపేట ప్రభుత్వ పాఠశాలలో ఎస్జిటీ గా పనిచేస్తున్నాడు. ఈ గవర్నమెంట్ టీచర్ ఫేస్ బుక్ లో ప్రభుత్వానికి,అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడట...అందులో చాలా అసభ్యకరమైన భాషతో కూడినవి ఉన్నాయట...అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు పెట్టే పోస్టులకు లైక్ లు కొట్టడం,కామెంట్లు,షేర్లు చెయ్యడం చేసేవాడట...ఈ వ్యవహారం రాన్రానూ శృతిమించడం, అయ్యవారి పోస్టులు అంతకంతకు పెరుగుతుండటంతో ఇతని వ్యవహారం నచ్చని తోటి ఉపాధ్యాయులు ఇతడిపై డిఈవో గంగా భవానికి ఫిర్యాదు చేశారు.

వేటు పడింది....
దీంతో మాస్టారి నిర్వాకం పై ఎంఈవోని విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. టీచర్ పై మంచింశెట్టి శ్రీనివాస సోషల్ మీడియా పోస్టులపై పూర్తి విచారణ జరిపిన ఎంఈవో ఇతడిపై వచ్చిన ఆరోపణలన్నీనిజమేనని ఆధారాలతో సహా నిర్ధారించారు. విచారణ నివేదికతో పాటు మాస్టారి పోస్టులకు సంబంధించిన నకళ్లను కూడా జతచేశారు. దీంతో మాస్టారి ప్రభుత్వ వ్యతిరేక పోస్టుల వ్యవహారం రుజువవడంతో డిఈవో గంగా భవాని ఈయనపై సస్పెన్షన్ వేటు వేశారు. సో...సోషల్ మీడియాలో ఏవైనా...పోస్టులు..షేర్లు,కామెంట్లు చేసే ముందు...బి కేర్ ఫుల్...

English summary
west godavari: The government teacher has suspended with immediate effect for posting over anti-government comments on social media. The west godavari deo released a press note on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X