వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపుల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: గవర్నర్ ప్రసంగం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన వల్ల సమస్యలను ఎదుర్కుంటున్నామని గవర్నర్ నరసింహన్ అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాల్సి ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ శనివారం ప్రసంగించారు. కేంద్రం నుంచి 2, 3 వందల కోట్లు మాత్రం అందాయని చెప్పారు.

Governor addresses Andhra Pradesh assembly

కాపు, బలిజ, వొంటరి కమ్యూనిటీలకు రిజర్వేషన్లను కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఆ కమ్యూనిటీల అభివృద్ధికి కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దానికి రానున్న బడ్జెట్‌లో వేయి కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఆయన చెప్పారు.
2015-16లో రెండంకెల వృద్దిరేటు సాధించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది 15 శాతం వృద్ది రేటు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 2018కల్లా పోలవరం మొదటి దశ పూర్తి చేస్తామని చెప్పారు. రాయలసీమలో భూగర్భజలాలను పెంచడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పెన్నా, కృష్ణానదులను అనుసంధానం చేస్తామని అన్నారు.

రూ.150తో ఫోన్, ఇంటర్నెట్ సేవలు అందిస్తామని గవర్నర్ అన్నారు. హుదుద్ తుఫాన్‌తో 17 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పారు. ఏడు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జలసిరితో 2.1 లక్షల ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు.

మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో 72లక్షల పట్టాదార్ల భూ రికార్డులు నవీకరించామని చెప్పారు. ఈ ఏడాదిలో అన్ని కుటుంబాలకు 15ఎంబీపీఎస్‌తో అంతర్జాలాన్ని అనుసంధానం చేస్తామని ప్రకటించారు. 2050కల్లా ఎపిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పారు.

ఆదాయవనరుల పెంపునకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ మెట్రో మూడేళ్లలో పూర్తవుతుందని ఆయన చెప్పారు.

మరిన్ని ముఖ్యాంశాలు

అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని సిటీ అవుతుంది. ఇందులో సింగపూర్ పాలు పంచుకుంటోంది
కాపు బలిజ, ఒంటరి, తెలగ, కులాలకు రిజర్వేషన్ల కోసం వేసిన మంజునాథ్‌ కమిషన్‌ 8 నెలల్లో నివేదిక ఇస్తుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీల ఉప ప్రణాళిక ప్రకారం నిధులు వెచ్చిస్తున్నాం.
రాష్ట్రంలో 7గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం.
విద్యుత్‌, ప్రసార పంపిణీ నష్టాలను 10.29 శాతానికి తగ్గించాం.
వచ్చే ఏడాది ఈ నష్టాన్ని సింగిల్‌ డిజిట్‌కు తేవడం లక్ష్యం.
ఉపకార వేతనాల వార్షిక చెల్లింపులకు బదులుగా త్వరలో నెలవారీ చెల్లింపు పద్ధతి.
వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ అమలు చేస్తాం.
1250 కి.మీ. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాం.
ఫ్లోటింగ్‌ స్టోరేజ్‌ రీ గ్యాసిఫికేషన్‌ యూనిట్‌ పనులను ఈ ఏడాది ప్రారంభిస్తాం.
ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు నగర గ్యాస్‌ పంపిణీ పని చేపడుతున్నాం.
యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ అనుగుణంగా పోర్టు ఆధారిత అభివృద్ధి నమూనా.
రూ.70వేల కోట్ల అంచనాలతో జాతీయ రహదార్ల విస్తరణ.
రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రైవేట్‌ వర్సిటీల బిల్లు తెచ్చాం.
ఏడు ప్రధాన జాతీయ సంస్థలను కేంద్రం మంజూరు చేసింది.
కేంద్రం మంజూరు చేసిన 5 విద్యా సంస్థలను ప్రారంభించాం.
2019-20నాటికి రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యం.
రుణ విముక్తికి ఇప్పటికే రూ.7,433 కోట్లు చెల్లించాం.
ఉద్యాన రైతులకు రూ.600కోట్ల రుణాల చెల్లింపు బాధ్యత తీసుకున్నాం.

English summary
Governor Narasimhan addressed the the both the houses of Andhra Pradesh today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X