విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్‌కు కేసీఆర్ గ్రాండ్ వెల్‌కం : ప‌్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజ‌రు : గ‌వ‌ర్న‌ర్‌తో సుదీర్ఘ భేటీ

|
Google Oneindia TeluguNews

ఏపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌రువాత తొలి సారి జ‌గ‌న్ హైద‌రాబాద్ వ‌చ్చారు. తొలుత గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో భేటీ అయ్యారు. ఆయ‌న‌తో సుదీర్ఘ స‌మావేశం జ‌రిగింది. తొలుత వైసీపీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశంలో జ‌గ‌న్‌ను ఏక‌గ్రీవం గా త‌మ నేత‌గా ఎన్నుకున్నట్లుగా లేఖ‌ను అందించి..ప్ర‌భుత్వ ఏర్పాటుకు సంసిద్ద‌త వ్య‌క్తం చేసారు. ఆ త‌రువాత ఇద్ద‌రూ ఏకాంతంగా చ‌ర్చించుకున్నారు. అక్క‌డి నుండి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లిన జ‌గ‌న్ కారుకు ఎదురు వ‌చ్చి మ‌రీ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలింగ‌నం చేసుకొని గ్రాండ్ వెల్‌కం చెప్పారు. అక్క‌డ స్వీట్ తినిపించి..పోచంప‌ల్లి శాలువా క‌ప్పి..వీణ బ‌హూక‌రించారు. ప్ర‌మాణ స్వీకారానికి రావాల‌ని జ‌గ‌న్ ఆహ్వ‌నించ‌గా వ‌స్తాన‌ని హామీ ఇచ్చారు.

Governor invited Jagan to form new govt ini AP..Kcr grand welcome for Jagan in his camp office.

వైసీపీఎల్పీ నేత‌గా ఎన్నికైన జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రిగా ఈ నెల 30న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. నేత‌గా చేసిన తీర్మానంతో పాటుగా తాము ప్ర‌భుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామ‌ని..అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ -గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య దాదాపు గంట సేపు స‌మావేశం జ‌రిగింది. ఎన్నిక‌ల్లో గెలిచిన జ‌గ‌న్‌కు గ‌వ‌ర్న‌ర్ అభినంద‌న‌లు తెలిపారు. జ‌గ‌న్‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అక్క‌డే గ‌వ‌ర్న‌ర్ లేఖ సిద్దం చేసి అంద‌చేసారు. 30వ తేదీ మ‌ధ్నాహ్నం 12.23 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ప్ర‌మాణ స్వీకారం జర‌గ‌నుంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ స్వ‌యంగా జ‌గ‌న్‌ను ఆహ్వానించారు. దీంతో..అధికారిక ప్ర‌క్రియ పూర్త‌వుతుంది ఈ సంద‌ర్బంగా ఏపీలో ఉన్న పాల‌నా ప‌రంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు. గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌తో జ‌గ‌న్ దంప‌తులు మంత‌నాలు సాగించారు.

Governor invited Jagan to form new govt ini AP..Kcr grand welcome for Jagan in his camp office.

జ‌గ‌న్‌కు కేసీఆర్ గ్రాండ్ వెల్‌కం..ఊహించ‌ని విధంగా..
రాజ్‌భ‌వ‌న్ నుండి జ‌గ‌న్ త‌న స‌తీమ‌ణి భార‌తితో పాటుగా పార్టీ నేత‌లు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. జ‌గ‌న్ కారు దిగే ప్ర‌దేశానికి అప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ .. కేటీఆర్‌..మంత్రులు ఎదురు చూస్తున్నారు. జ‌గ‌న్ కారు దిగ‌గానే..కౌగ‌లించుకొని ఆప్యాయంగా జ‌గ‌న్‌ను కేసీఆర్ స్వాగ‌తించారు. ఆ త‌రువాత త‌న నివాసంలోకి తీసుకెళ్లి స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డికి..కుటుంబ స‌భ్యుల‌కు..మంత్రుల‌కు ప‌రిచయం చేసారు.

Governor invited Jagan to form new govt ini AP..Kcr grand welcome for Jagan in his camp office.

స్వీట్ తినిపించి..పోచంప‌ల్లి శాలువా క‌ప్పి..జ్ఞాపిక బ‌హూక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ-తెలంగాణ మ‌ధ్య స‌ఖ్య‌త‌తో కొన‌సాగాల‌ని కోరుకుంటున్న‌ట్లుగా చెప్పారు. 30న త‌న ప్ర‌మాణ స్వీకారానికి రావాల‌ని జ‌గ‌న్ ఆహ్వానించ‌గా తాను 29 సాయంత్ర‌మే విజ‌య‌వాడ‌కు చేరుకుంటాన‌ని చెప్పారు. ఇక‌, ఏపికి అన్ని విష‌యాల్లో త‌మ వంతు స‌హ‌కారం ఉంటుంద‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా విజ‌య సాయిరెడ్డి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాళ్ల మీద‌కు ఒంగి న‌మ‌స్కారం చేసే ప్ర‌య‌త్నం చేసారు.

English summary
Governor invited Jagan to form new govt in AP. Jagan couple met Governor and KCR. Telangnana Cm KCR grand welcome to Jagan. In pragathi Bhavan Jagan met KCR and invited him for his swearing ceremony..KCR assured his attendence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X