వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాలపై గవర్నర్ ఆకాంక్ష, గంటా-అయ్యన్నల బాక్సింగ్ పంచ్‌లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొని అభివృద్ధి చెందాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఆకాంక్షించారు. ఆయన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల పైన గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. సమర్థవంతంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇదే ఒరవడిని కొనసాగించాలని చెప్పారు.

అందరికీ మంచి జరగాలి: చంద్రబాబు

కొత్త సంవత్సరం రోజున అందరికీ మంచి జరగాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బెజవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

చంద్రబాబు భద్రతపై ప్రత్యేక దృష్టి

ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత పైన ప్రత్యేక దృష్టడి సారించామని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ కుమార్ చెప్పారు. సీఎం భద్రత కోసం డిఎస్పీ స్థాయి అధికారి ఉండేటట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కృష్ణా నదిలో ప్రత్యేక మెట్లు ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు చేస్తున్నామన్నారు.

రాజధానిలో పర్యటించే విదేశీయుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తుళ్లూరు స్టేషన్‌లో కూడా సిబ్బందిని పెంచి నేరాల అదుపుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. కెఎల్ వర్సీటీ సమీపంలో ఉండటం, విదేశీ విద్యార్థులు విద్యను అభ్యసించడంపై ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కల్పించడంతో పాటు నిఘా ఉంచుతున్నట్లు చెప్పారు.

మంత్రులు గంటా, అయ్యన్నల బాక్సింగ్

విశాఖ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ ఎంజీఎం పార్కులో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా సాగర తీరంలోని బీచ్ రోడ్డులో ఉత్తరాంధ్రలోని 9 ప్రధాన ఆలయాల నమూనాలను ప్రదర్శిస్తున్నారు.

సాయంత్రం కైలాసగిరిపై లేజర్ షో ప్రదర్శించనున్నారు. ఈ నెల 3న విశాఖ ఉత్సవాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

కాగా, గురువారం నాడు మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్నపాత్రుడు బాక్సింగ్ పంచ్‌లు విసురుకున్నారు. ఈ ఆసక్తికర సంఘటన సాగర తీరంలో జరిగింది. వీరిద్దరి మధ్య రాజకీయ వైరం నెలకొంది. అయితే గురువారం మాత్రం వీరిద్దరూ విశాఖ తీరంలో అందరికీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

బాక్సింగ్ పోటీలను ప్రారంభించేందుకు వచ్చిన అయ్యన్న, గంటాలు చేతులకు గ్లౌస్ తొడుక్కుని ఒకరిపై మరొకరు పంచ్‌లు విసురుకున్నారు. అయ్యన్న నీలం రంగు గ్లౌస్ తొడగగా, గంటా మాత్రం ఎరుపు రంగు గ్లౌస్ తొడుక్కుని సరదాగా ముష్టి ఘాతాలు విసురుకున్నారు.

English summary
Governor Narasimhan and AP CM Chandrababu extend New Year greetings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X