వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జ‌గ‌న్‌కు గ‌వ‌ర్న‌ర్ క్ష‌మాప‌ణ‌లు: త‌ప్పులు చేశా..ఫిరాయింపుల‌ విష‌యంలోనా : ఆ నిర్ణ‌యంలోనూ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP ప్ర‌జ‌ల‌కు,జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్|Ap Governor Says Sorry To Jagan!

ఒక భావోద్వేగ స‌న్నివేశం. తొమ్మిదేళ్ల‌కు పైగా రికార్డు స్థాయిలో గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేసిన వ్య‌క్తి. ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న వ్య‌క్తి ఇప్పుడు తెలంగాణ‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. దీంతో..ఆయ‌న‌కు ఏపీ ప్ర‌భుత్వం వీడ్కోలు స‌భ‌ను ఏర్పాటు చేసింది. ఆ స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ భావోద్వేగానికి గుర‌య్యారు. ఏపీ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబు తూనే..క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అంత‌టితో ఆగ‌లేదు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ప్ర‌త్యేంగా క్ష‌మాప‌ణలు కోరుతున్నానంటూ స‌భా వేదిక‌గా చెప్పుకొచ్చారు. గ‌వ‌ర్న‌ర్ ప‌రిధి దాటి కొన్ని విష‌యాల్లో వ్య‌వ‌హ‌రించానంటూ వ్యాఖ్యానించారు. అయితే, గ‌వ‌ర్న‌ర్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు..ప్ర‌త్యేకంగా జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌టానికి..ఆయ‌న భాషలోని భావం చూస్తే.. ఆ రెండు కార‌ణా లే ప్ర‌ధానం గా క‌నిపిస్తున్నాయి. గ‌వ‌ర్న‌ర్‌లో ఒక ర‌కంగా ప‌శ్చాత్తాపం క‌నిపించింది.

జ‌గ‌న్‌కు రాజ‌ధాని ముళ్ల‌కంప‌..అవినీతి ముద్ర వారిదే:భూముల‌ ధ‌ర‌లు ప‌డిపోయాయి: చ‌ంద్ర‌బాబు ఫైర్‌..!జ‌గ‌న్‌కు రాజ‌ధాని ముళ్ల‌కంప‌..అవినీతి ముద్ర వారిదే:భూముల‌ ధ‌ర‌లు ప‌డిపోయాయి: చ‌ంద్ర‌బాబు ఫైర్‌..!

తెలిసి కొన్ని..తెలియ‌క కొన్ని..భావోద్వేగం..

తెలిసి కొన్ని..తెలియ‌క కొన్ని..భావోద్వేగం..

గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు ఏపీ ప్ర‌భుత్వం వీడ్కోలు స‌భ ఏర్పాటు చేసింది. ఆ స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ న‌రసింహ‌న్ భావోద్వేగానికి గుర‌య్యారు. ఏకంగా తొమ్మ‌దిన్నార ఏళ్లు తాను గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేసిన రాష్ట్రం వీడుతున్నందుకు బాధ‌గా ఉందని చెబు తూనే కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. తెలిసి కొన్ని..తెలియ‌క కొన్ని త‌ప్పులు చేసాన‌ని అంగీక‌రించారు. ప్ర‌త్యేకంగా సీఎం జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని అన్నారు. జ‌గ‌న్ చ‌రిత్ర సృష్టిస్తార‌ని ఆకాంక్షించారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ పాల‌న‌ను అభినందించారు. రాష్ట్ర అధికారుల‌ను ప్ర‌శంసించారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్‌గా ప‌రిధి దాటి కొన్ని విష‌యాల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన ఒత్తిడి చేసాన‌ని చెప్పుకొచ్చారు. త‌న చిన్న‌కుమారుడి త‌ర‌హాలో జ‌గ‌న్ తో వ్య‌వ‌హ‌రించాన‌ని భావోద్వేగానికి గుర‌య్యారు. సీఎం జ‌గ‌న్ సైతం న‌రిసంహ‌న్ పైన ప్ర‌శ‌సంలు కురిపించారు. మంత్రు లు..అధికారులు గ‌వ‌ర్న‌ర్‌ను స‌త్క‌రించారు.

తెలిసి చేసిన త‌ప్పులు..క్ష‌మాప‌ణ‌లు

తెలిసి చేసిన త‌ప్పులు..క్ష‌మాప‌ణ‌లు

గ‌వ‌ర్న‌ర్ న‌రసింహ‌న్ త‌న వీడ్కోలు స‌భ‌లో తెలిసి కొన్ని..తెలియ‌క కొన్ని త‌ప్పులు చేసానంటూ..క్ష‌మాప‌ణ‌లు కోరారు. అయితే, ఇప్పుడు న‌ర‌సింహ‌న్ చేసిన వ్యాఖ్య‌లు..ఆయ‌న తెలిసి చేసిన త‌ప్పులు ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది. టీడీపీ హాయంలో చంద్ర‌బాబు ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు. వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసి వారిని టీడీపీలోకి తీసుకున్నారు. అయితే, అందులో న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. వారు పార్టీ ఫిరా యించార‌ని..వారు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌టానికి అన‌ర్హుల‌ని వైసీపీ అభ్యంత‌రం చెప్పింది. కానీ, గ‌వ‌ర్న ర్ ప‌ట్టించుకోలేదు. చంద్ర‌బాబు ఒత్తిడితో వారితో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. తెలంగాణ‌లో అప్ప‌టికే త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌తో ఇదే త‌ర‌హాలో ప్ర‌మాణ స్వీకారం చేయించ‌టంతో..గ‌వ‌ర్న‌ర్ ఇక్క‌డ నో చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో చిక్కుకున్నారు. ఈ విష‌యంలో గ‌వ‌ర్న‌ర తీరు పైన పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఫిరాయింపుల వ్య‌వ‌హారం పైన గ‌వ‌ర్న‌ర్‌కు అనేక సార్లు విజ్ఞ‌ప్తి చేసినా..ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకోలేదు. దీనికి ఆయ‌న ఇప్పుడు తెలిసి చేసిన త‌ప్పు అంటూ క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నారు.

జ‌గ‌న్‌కు సారీ...ఎందుకంటే..

జ‌గ‌న్‌కు సారీ...ఎందుకంటే..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు సైతం గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌త్యేకంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఫిరాయింపుల వ్య‌వ‌హారంతో పాటుగా రాష్ట్రంలో అవినీతి గురించి అనేక సార్లు ఆధారాల‌తో స‌హా జ‌గ‌న్ ఫిర్యాదు చేసారు. ఇక‌, ప్ర‌ధానంగా జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత తెలంగాణ‌తో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం న‌ర‌సింహ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద ఒత్తిడి తెచ్చార‌నే అభిప్రాయం ఉంది. చంద్ర‌బాబుకు చెప్పినా విన‌లేద‌ని..ఏపీ ఆధీనంలో ఉంటూ..నిరుప‌యోగంగా ఉన్న స‌చివాల‌య భ‌వ‌నాల‌ను తెలంగాణ‌కు అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ మీద గ‌వ‌ర్న‌ర్ ఒత్తిడి తెచ్చారు. ఫ‌లితంగా జ‌గ‌న్ అంగీక‌రించ‌క త‌ప్ప‌లేదు. దీనినే గ‌వ‌ర్న‌ర్ ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. గ‌వ‌ర్న‌ర్ ప‌రిధి దాటి తాను ముఖ్య‌మంత్రి మీద ఒత్తిడి తెచ్చాన‌ని అంగీక‌రించారు. అదే విధంగా రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనూ ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు వ్య‌తిరేకం గా గ‌వ‌ర్న‌ర్ హోదాలో న‌ర‌సింహ‌న్ నివేదికల ఇచ్చార‌నే వాద‌న ఉంది. విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలోనూ తెలంగాణ కు అనుకూలంగా ప‌ని చేసార‌నే అభిప్రాయం వ్య‌క్తం అయింది. ఇక‌, ఓటుకు నోటు వ్య‌వ‌హారంలోనూ ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాల్సి విధంగా వ్య‌వ‌హ‌రించలేద‌ని అప్ప‌ట్లోనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వీట‌న్నింటికీ..రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్
నేరుగా అంశాల‌ను ప్ర‌స్తావించ‌క పోయినా తాను చేసిన త‌ప్పుల‌కు క్ష‌మాప‌ణ కోరిన‌ట్లు క‌నిపిస్తోంది.

English summary
Governor Narasimhan say sorry to AP Public and CM jagan. AP Govt given fare well to Narasimhan for hie services to AP. Narasimhan praised Jagan Administration in 45 days time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X