హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ అల్లర్లపై మెజీస్టిరియల్ దర్యాప్తు: గవర్నర్

By Pratap
|
Google Oneindia TeluguNews

 Governor ordered for megisterial enquiry on Hyderabad incident
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కిషన్‌బాగ్‌లో బుధవారం జరిగిన అల్లర్లపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు గవర్నర్ నరసింహన్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం అల్లర్లపై సమీక్ష నిర్వహించారు.

అల్లర్లలో మృతి చెందిన కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 నష్ట పరిహారాన్ని గవర్నర్ ప్రకటించారు. అలాగే ఆస్తులు కోల్పోయినవారికి నిబంధ నల ప్రకారం పరిహారం చెల్లింపులు ఉంటాయని గవర్నర్ నరసింహన్ ప్రకటించారు.

కిషన్‌బాగ్‌లో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో డిజిపి ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి గురువారం ఉదయం పర్యటించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డిజిపి పోలీసులను ఆదేశించారు.

బుధవారం ఉదయం కిషన్‌బాగ్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన హైదరాబాదులో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.

English summary
Governor Narasimhan had ordered for megisterial enquiry on Hyderabad incident. DGP Prasad rao visted Kishanbagh area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X