• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గవర్నర్ గారూ!..వినతిపత్రం ఇద్దామంటే...అమరావతికి రారెందుకు?:ఎపిసిసి

|
  గవర్నర్ గారూ!..వినతిపత్రం ఇద్దామంటే...అమరావతికి రారెందుకు?

  విజయవాడ:తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ తీరును ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ దుయ్యబట్టింది. రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణంపై గవర్నర్ కు వినతిపత్రం ఇద్దామంటే ఆయన రావడం లేదని ఎపిసిసి విమర్శిస్తోంది.

  విజయవాడ లో జరిగిన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు గాను గవర్నర్ కు గతంలో ఒకమారు, తాజాగా మరోసారి లేఖలు రాయడం జరిగిందని, అయినా ఏమాత్రం స్పందన లేదని విమర్శించారు. బహుశా గవర్నర్ బిజెపి వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారేమోనని ఎద్దేవా చేశారు.

  ఇక ఏపీపై రాహుల్‌ గాంధీ స్పెషల్ ఫోకస్‌...ప్రతి నెలా రాష్ట్ర పర్యటనకు రాక!

  సోమవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, కొప్పుల రాజు, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం తదితరులు హాజరయ్యారు. అనంతరం ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరా, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ మీడియాతో మాట్లాడారు.

  రఘువీరా

  రఘువీరా

  తొలుత ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరా మట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతిపై దర్యాప్తు చేయాలని...మోదీ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌కు గవర్నరు ద్వారా వినతి పత్రం సమర్పిస్తామని, దీనిని విజయవాడలో గానీ, అమరావతిలో గానీ అందుకోవాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు గతంలో లేఖ రాశామని.. తాజాగా మరోసారి రాశామని చెప్పారు. కానీ గవర్నర్ నుంచి కనీస స్పందన లేదన్నారు.

  వినతిపత్రాన్ని ఈ-మెయిల్‌ ద్వారా

  వినతిపత్రాన్ని ఈ-మెయిల్‌ ద్వారా

  బహుశా ఆయన హైదరాబాద్‌లో బీజేపీ ఎన్నికల వ్యవహారాల్లో తనమునకలై ఉన్నందువల్ల విజయవాడకు రాలేకపోతున్నారేమోనని రఘువీరా ఎద్దేవాచేశారు.

  గతంలో చీటికీ మాటికీ చిన్నా చితకా కార్యక్రమాలకు అమరావతి వచ్చే నరసింహన్‌...కాంగ్రెస్‌ వినతి పత్రం ఇవ్వాలనుకుంటే ఎందుకు రాలేదని, రావడం లేదని నిలదీశారు. అయినప్పటికీ వినతిపత్రాన్ని ఈ-మెయిల్‌ ద్వారా ఆయనకు పంపుతున్నామని తెలిపారు.

  రాఫెల్‌ వ్యవహారంపై

  రాఫెల్‌ వ్యవహారంపై

  2019లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని...రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో రూ.41 వేల కోట్ల అవినీతికి పాల్పడిన ప్రధాని మోదీని జైలుకు పంపుతామని రఘువీరా హెచ్చరించారు. ప్రధాని మోడీని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎందుకు విమర్శించడం లేదు. రాఫెల్‌ వ్యవహారంపై ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారు?.. అని రఘువీరా నిలదీశారు.

  ఊమెన్ చాందీ

  ఊమెన్ చాందీ

  ఈ క్రమంలో తిరుపతి మాజీ ఎంపి చితామోహన్ ఎపిసిసి అధ్యక్షుడిగా రఘువీరాను తప్పించాలని కాంగ్రెస్ ఎపి వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ డిమాండ్ చేశారు. "పీసీసీ అధ్యక్షునిగా బీసీ వర్గాలకు చెందిన రఘువీరారెడ్డి నాలుగేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన హయాంలో పార్టీ ఎంత బలం పడిందో చూశాం. ఇక చాలు...ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించండి"...అని చాందీని చింతా మోహన్‌ కోరారు. దీనిని ఆయన తిరస్కరించారు. అనంతరం రాఫెల్‌ వ్యవహారంపై విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో రఘువీరా ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించాయి.

  English summary
  Andhra Pradesh Congress Committee blames to Governor Narasimhan, who is not available in Amaravathi to receive their memorandum.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X