వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ‌వ‌ర్న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు : తిరుమ‌ల లో అనుమానాల‌పైనే దృష్టా..! టిడిపి నేత‌ల్లో అల‌జ‌డి..

|
Google Oneindia TeluguNews

తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఆక‌స్మికంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. కొద్ది రోజుల క్రిత‌మే గ‌వ‌ర్న‌ర్ తిరుమ‌ల కు వ‌చ్చిన స‌మ‌యంలో అనేక ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. ఇప్పుడు వైకుంఠ ఏకాద‌శి ఉత్స‌వాల్లో శ్రీవారిని ద‌ర్శించుకొనేందుకు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ తిరుమ‌ల లో ఆక‌స్మిక త‌నిఖీలు చేయ‌టం పై కొత్త సందేహాలు వ్య‌క్తం అవుతున్నా యి. కొంత కాలం క్రితం తిరుమ‌ల లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాలంటూ ర‌మ‌ణ దీక్షితులు అనేక ఆరోప‌ణ‌లు చేసారు. ఆ త‌రువాత బిజెపి అధినాయ‌త‌క్వం సైతం తిరుమ‌ల పై దృష్టి సారించింద‌నే వార్త‌లు వ‌చ్చాయి.. ఇప్పుడు ఈ కోణంలోనే గ‌వ‌ర్న‌ర్ త‌నిఖీలు చేస్తున్నారా అనే చ‌ర్చ టిడిపి నేత‌ల్లో మొద‌లైంది..

ద‌ర్శ‌నం..త‌నిఖీలు..

గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తిరుమల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని ద‌ర్శించుకొనేందుకు స‌తీమ‌ణి తో స‌హా క‌లిసి వ‌చ్చారు. సోమ‌వారం శ్రీవారిని ఒక ద‌ఫా ద‌ర్శించుకున్న త‌రువాత ఆయ‌న అక్క‌డ ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. గ‌వ‌ర్న‌ర్ హోదాలో గ‌తంలో వ‌చ్చిన ఏ గ‌వ‌ర్న‌ర్ ఈ త‌ర‌హాలో త‌నిఖీలు చేయ‌లేదు. న‌ర‌సింహ‌న్ ఏపి గ‌వ‌ర్న‌ర్ గా 2009 నుండి కొన‌సాగ‌తున్నారు. అనేక సార్లు శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు. కానీ, గ‌త నెల‌లో వ‌చ్చిన సంద‌ర్భం..ఇప్పుడు మిన‌హా మరెప్పుడూ ఇంత‌గా శ్రీవారి ఆల‌యంలో లోప‌ల నిర్మాణాలు..విష‌యాల పై దృష్టి పెట్ట‌లే దు. కొద్ది కాలం క్రితం తిరుమ‌ల లో త్ర‌వ్వ‌కాలు జ‌రిగాయ‌ని..అక్ర‌మంగా సొమ్మును మ‌ళ్లిస్తున్నారంటూ నాటి ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు ఆరోప‌ణ‌లు చేసారు. అదే స‌మ‌యంలో..బిజెపి నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి కోర్టులో పిటీష‌న్ సైతం దాఖ‌లు చేసారు.ఆ సంద‌ర్భంలో బిజెపి కేంద్ర నాయ‌కత్వం తిరుమ‌ల పై కుట్ర‌లు చేస్తుంద‌ని ఏపి ప్ర‌భుత్వం.. టిడిపి నేత‌లు ఆరోప‌ణ‌లు చేసారు. ఆ త‌రువాత ఆ ఇష్యూ స‌మిసిపోయింది.

Governor surprise Visits in Tirumala : TDP leaders many doubts..

అనుమానాల నివృత్తి కోస‌మేనా..

కాగా, గ‌వ‌ర్న‌ర్ తిరుమ‌ల లో నిశితంగా ప‌రిశీల‌న చేయ‌టం వెనుక‌..కేంద్రంతో పాటుగా త‌న‌కు ఉన్న అనుమానాలు.. ర‌మ‌ణ దీక్షితులు చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజాలు ఏంట‌నే తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే సందేహాలు మొద‌లు అయ్యాయి. త్ర‌వ్వ‌కాల్లో నిజా నిజాలెంతో తెలుసుకొనే ప్ర‌క్రియ లో భాగంగానే త‌నిఖీల పేరుతో ప‌రిశీల‌న చేసి ఉంటార ని కొంద‌రు టిడిపి నేత‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, స‌మిసిపోయిన వివాదం పై గ‌వ‌ర్న‌ర్ నిజంగా ఇప్పుడు దృష్టి సారించారా అనే సందేహాలూ ఉన్నాయి. గ‌వ‌ర్న‌ర్ పూర్తిగా కేంద్రం మ‌నిషిగా అన్ని సంద‌ర్భాల్లోనూ రుజువైంద‌ని..ఆయ‌న త‌నిఖీల‌ను అంత సులువుగా తీసుకోలేమ‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. అయితే, గ‌వ‌ర్న‌ర్ మాత్రం తిరుమ‌ల లో వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్లు చాలా బాగున్నాయంటూ కితాబిచ్చారు.

English summary
Governor Narasimhan sudden inspections in Tirumala. Many doubts from TDP leaders on Governor inspections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X