వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు పక్కన పెట్టారు..నేడు కీలక స్థానాలిచ్చారు : ఆ ఇద్దిరకీ సీఎం జగన్ ప్రాధాన్యం: ఏం జరిగింది..!!

|
Google Oneindia TeluguNews

ఆ ఇద్దరు అధికారులు చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. రాజధాని వ్యవహారాల్లో ఆ ఇద్దరే ప్రధాన భూమిక. రాజధాని పేరుతో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుండి నేడు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో..అప్పుడు పీపీఏల విషయంలో..రాజధాని వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన అధికారులును జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే పక్కన పెట్టారు. వారి స్థానాల్లో వేరు అధికారులను నియమించారు. మూడు నెలలుగా వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు తిరిగి ఆ ఇద్దరు అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చారు. అందునా కీలక విభాగాలు అప్పగించారు. ఏం జరిగింది..వారికి నాడు నో చెప్పి..జీఏడికి రిపోర్ట్ చేయమని చెప్పిన ప్రభుత్వం..ఆ ఇద్దరికి ఇప్పుడు ఈ పోస్టింగ్ ల వెనుక ఎవరి ఒత్తిడి పని చేసింది. ఇంతకీ ఆ ఇద్దరు అధికారులు..వారి పోస్టింగ్ లు ఏంటో తెలుసా...

నాడు వద్దన్నారు..నేడు కీలక పోస్టింగ్ లు..
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పలువురు అఖిల భారత సర్వీసు అధికారులను బదిలీ చేసింది. ఐఏఎ్‌సలకు స్థానం చలనం కల్పించి, కొత్తగా డిప్యుటేషన్‌పై ఏపీకి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. వెయిటింగ్‌లో ఉన్న అజయ్‌ జైన్‌ను గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించింది. అజయ్ జైన్ చంద్రబాబు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. విద్యుత్ శాఖతో పాటుగా రాజధాని వ్యవహారాల్లో ఆయన పాత్ర కీలకం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అజయ్ జైన్ ను జీఏడికి రిపోర్ట్ చేయమని ఆదేశించి..ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. ప్రభుత్వం పీపీఏల సమీక్ష...రాజధాని పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించిన వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని పనులను నిలిపివేసారు. పీపీఏల సమీక్ష కు నిర్ణయించారు. దీంతో..వాటీ మీద పూర్తి నిర్ణయం జరిగే వరకూ అధికారులను పక్కన పెడతారని భావించారు. కానీ, అనూహ్యంగా అజయ్ జైన్ కు కీలకమైన హౌసింగ్ ముఖ్య కార్మదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో నాడు సీఆర్డీఏ కమిషనర్ గ పని చేసిన శ్రీధర్ ను సైతం పక్కన పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా నియమించింది. రాజధానిలో భూ సమీకరణ.. స్థలాల కేటాయింపు..ఒప్పందాల విషయంలో శ్రీధర్ కీలకంగా వ్యవహరించారు. మూడు నెలల పాటు పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టిన ప్రభుత్వం తాజాగా పోస్టింగ్ ఇచ్చింది.

Recommended Video

రాజధాని అమరావతి నుండి తరలిస్తే సహించం పవన్ కళ్యాణ్| Pawan Kalyan Ultimatum To Jagan On Capital Issue
Govt again given key posts to who worked in Chandra Babu tenure in capital

మిగిలిన అధికారుల విషయంలో ఎలా..
ఇప్పుడు కీలకమైన ఇద్దరు అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు పోస్టింగ్ లు లేకుండా పక్కన పెట్టిన అధికారుల విషయంలో ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారింది. నాటి ప్రభుత్వ ఆలోచనలు..ఆదేశాల మేరకే అధికారులు పని చేసారని..వారికి వ్యక్తిగత ప్రయోజనాలు లేవని వారు ప్రభుత్వంలోని ముఖ్యుల దగ్గర వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. దాని ఫలితంగా ఇద్దరు అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చారు. అదే విధంగా చంద్రబాబు హాయంలో సీఎంఓ లో పని చేసిన సతీష్ చంద్ర..రాజమౌళి..సాయి ప్రసాద్ సైతం పోస్టింగ్ లు కోసం నిరీక్షిస్తున్నారు. టీటీడీ జేఈవోగా పని చేసిన శ్రీనివాస రాజు కు సైతం ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వాల్సి ఉంది. అధికారులను పక్కన పెట్టటం పైన కేంద్రం సైతం ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో..వారికి గతంలో పని చేసిన శాఖలతో సంబంధం లేకుండా ఇతర పోస్టింగ్ లు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఇద్దరు అధికారులకు మాత్రమే పోస్టింగ్ లు ఇచ్చి..జీఏడికి అటాచ్ చేసిన ఇతర అధికారుల విషయంలో నిర్ణయం తీసుకోకపోవటం చర్చకు కారణమైంది. వీరి విషయంలో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందనేది రానున్న రోజుల్లో తేలనుంది.

English summary
Ap Govt again given key posts to who worked in Chandra Babu tenure in capital. those officers kept in GAD with out giving postiings after jagan became CM. Now Govt given posting orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X