వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో ఫ్లై లిస్ట్: జెసి ఎఫెక్ట్, విమానంలో కొత్త రూల్స్! అతిగా ప్రవర్తిస్తే ఇలా..

కేంద్రం దేశీయ విమాన ప్రయాణికులకు సరికొత్త నిబంధనలు తీసుకురానుంది. ఈ మేరకు శుక్రవారం 'నో ఫ్లై లిస్ట్‌'ను విడుదల చేయనున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి/న్యూఢిల్లీ: కేంద్రం దేశీయ విమాన ప్రయాణికులకు సరికొత్త నిబంధనలు తీసుకురానుంది. ఈ మేరకు శుక్రవారం 'నో ఫ్లై లిస్ట్‌'ను విడుదల చేయనున్నారు.

ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ విమానాల్లో టికెట్లు బుకింగ్‌ చేసుకోవాలంటే గుర్తింపు కార్డు నంబర్‌ను తప్పనిసరి చేయనున్నారు.

అంటే బుకింగ్‌ సమయంలో ఆధార్, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, పాన్‌.. ఏదో ఓ గుర్తింపు కార్డు నంబర్‌ ఇవ్వాలి. దీనిపై త్వరలోనే కేంద్రం అధికారిక ప్రకటన చేయనుందని తెలుస్తోంది. గుర్తింపు కార్డుల్లో ఓటరు కార్డును కూడా చేర్చే అవకాశముంది.

వీరికి నో ఛాన్స్

వీరికి నో ఛాన్స్

నో ఫ్లై జాబితా నిబంధన ప్రకారం క్రిమినల్‌ రికార్డులు ఉన్నవారు, వివాదాస్పద ప్రయాణికులు దేశీయ విమానాల్లో ప్రయాణించకుండా వారిపై నిషేధం విధిస్తారు. అంతేగాక నిఘా వర్గాలు ముప్పుగా భావించే వ్యక్తుల పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చనున్నారు.

జేసీ, గైక్వాడ్ ఎఫెక్ట్

జేసీ, గైక్వాడ్ ఎఫెక్ట్

ఇటీవల విమానాల్లో చోటుచేసుకుంటున్న వివాదాస్పద ఘటనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌, టిడిపి జెసి దివాకర్ రెడ్డి ఇటీవల ఎయిర్ పోర్టు సిబ్బందితో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనల వల్ల ప్రయాణికుల భద్రతకు భంగం వాటిల్లుతుందని భావించిన విమానయాన శాఖ నో ఫ్లై లిస్ట్‌ను తీసుకొస్తోంది.

అమెరికాలో ఇప్పటికే అమల్లో

అమెరికాలో ఇప్పటికే అమల్లో

ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఈ నిబంధనలపై పలువురు నిపుణులతో చర్చించిన విమానయాన శాఖ శుక్రవారం దీనిపై అధికారిక ప్రకటన వెలువరించనుందని తెలుస్తోంది.

విమానాల్లో ఇలా చేస్తే.. ఈ చర్యలు

విమానాల్లో ఇలా చేస్తే.. ఈ చర్యలు

విమానాల్లో అనుచిత ప్రవర్తనకు పాల్పడే ప్రయాణికులపై కనిష్ఠంగా మూడు నెలుల నుంచి గరిష్ఠంగా జీవితకాలం నిషేధం విధించనున్నారు. సిబ్బందిపై దూషించడం, చేతులు ఎత్తి కొట్టేందుకు ప్రయత్నిస్తే వారిపై మూడు నెలల నిషేధం ఉంటుంది. ఇక సిబ్బందిని కొట్టడం, తోసివేయడం, అసభ్యంగా తాకడం, లైంగికంగా వేధించడం వంటివి చేస్తే ఆరు నెలలు నిషేధం విధిస్తారు. విమాన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ధ్వంసం చేయడం, సిబ్బంది కంపార్ట్‌మెంట్‌లోకి దూసుకెళ్లడం లాంటివి చేస్తే రెండేళ్ల నుంచి జీవితకాలం వరకూ నిషేధం ఉండనుంది.

English summary
Civil aviation minister Ashok Gajapathi Raju on Friday will unveil new rules to tackle unruly or disruptive passengers and to form a “national no fly list” for air safety. The no-fly list will allow airlines to deplane unruly passengers, which is a first for the Indian aviation industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X