వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: పేదలకు రూ.5 వేలు ఇవ్వాలి, స్వయం నియంత్రణే శ్రీరామరక్ష: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మరి చాపకింద నీరులా ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ సోకిన వారి సంఖ్య 13కి చేరుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే వైరస్ సోకుతున్న.. లాక్ డౌన్ విధించిన పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సామాజిక దూరం పాటిస్తేనే వైరస్‌ను పారదోలగలమని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు.

 govt must give to poor people 5k: chandrababu naidu

కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్దులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల చాలా దేశాల్లో కరోనా వైరస్‌ను నియంత్రించగలిగారని పేర్కొన్నారు. వైరస్‌కు మందులు లేనందున నివారణ కోసం వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని నొక్కి వక్కానించారు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd

ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని చంద్రబాబు నాయుడు సూచించారు. ఎక్కడివారు అక్కడే ఉండాలని కోరారు. సరిహద్దు దాటి రావడం వల్ల ఆ రెండు రాష్ట్రాలకు ఇబ్బంది కలుగుతుందని.. హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చేవారిని ఉద్దేశించి చంద్రబాబు కామెంట్ చేశారు. కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా పేదలకు రూ. 5 వేలు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అందజేసే రూ.5 వేలు సరిపోవని పేర్కొన్నారు. పేదలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చంద్రబాబు గుర్తుచేశారు.

English summary
andhra pradesh government must give to each poor people 5k tdp chief chandrababu naidu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X