వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఆ ఉద్యోగుల సేవలు రద్దు: నెలాఖరులోగా తొలిగించండి: ప్రభుత్వ నిర్ణయం వెనుక..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Govt Decided To Not Continue Retired Employees Services In Future || ఏపీ సర్కారు కీలక నిర్ణయం !

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సేవలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31కు ముందున్న వారి సేవలు అవసరం లేదని తేల్చింది. అదే విధంగా 40 వేల వేతనం మించిన అవుట్ సోర్సింగ్ సిబ్బందినీ తపపించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. టీడీపీ హాయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా..పేపర్ నోటిఫికేషన్ లేకుండా నియమితులైన వారిని సైతం తొలిగించాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం ఇప్పుడు ఇంత కీలక నిర్ణయం తీసుకోవటం వెనుక ఉన్న కారణాలు ఏంటనే చర్చ మొదలైంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనికి అనేక కారణాలను తెర మీదకు తీసుకొస్తున్నారు. ముందుగా వారిని తొలిగిస్తే..ప్రభుత్వం ఏం చేయబోయేది విరిస్తున్నారు.

కమలేశ్ హంతకుల తల తీసుకొస్తే రూ.కోటి రివార్డు.. శివసేన నేత ప్రకటనకమలేశ్ హంతకుల తల తీసుకొస్తే రూ.కోటి రివార్డు.. శివసేన నేత ప్రకటన

రిటైర్డ్‌ ఉద్యోగుల సేవల రద్దు

రిటైర్డ్‌ ఉద్యోగుల సేవల రద్దు

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో వివిధ హోదాల్లో కొనసాగుతున్న రిటైర్డ్‌ ఉద్యోగుల సేవలకు సర్కారు ఉద్వాసన చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ చేసినా..ప్రభుత్వంలోనే ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముందు నుంచి సేవలు అందిస్తున్న వారందరినీ తక్షణం తప్పించాలని ఆదేశించింది. అలాగే... మార్చి 31వ తేదీకి ముందు పేపర్‌ నోటిఫికేషన్‌, సంబంధిత నియామక ప్రక్రియ ద్వారా కాకుండా నియమితులైన రూ.40 వేల పైబడి వేతనం తీసుకుంటున్న కాంట్రాక్టు..ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందినీ తొలిగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు రాష్ట్రస్థాయితో మొదలుకొని జిల్లా, డివిజన్‌, మండల, గ్రామ కార్యాలయాలతోపాటు కార్పొరేషన్లు, అటానమస్‌ సంస్థలకు వర్తిస్తుందని జీవోలో స్పష్టం చేశారు.

 అమలు చేయకపోతే వారే బాధ్యులు..

అమలు చేయకపోతే వారే బాధ్యులు..

దీనిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, సెక్రటరీలు ఈ నెల 31 లోపు తగు చర్యలు తీసుకుని సంబంధిత నివేదికను సాధారణ పరిపాలనశాఖకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలను సకాలంలో అమలు చేయకపోతే సంబంధిత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇక డిప్యూటీ కార్యదర్శి అంతకంటే ఎక్కువ హోదా ఉన్న అధికారుల్లో ఎవరైనా ఇప్పటికీ ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముందున్న సీటులోనే ఇప్పటికీ ఉంటే... వారి సబ్జెక్టు మార్చడం,..లేదా హెడ్‌ క్వార్టర్స్‌లోనే మరో ఆఫీసుకు పంపడం చేయాలని ప్రభుత్వం సూచించింది. మూల వేతనం రూ.56,780 కంటే ఎక్కువ ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని వివరించారు. గత ప్రభుత్వ హాయంలో ఇష్టానుసారం నియామకాలు జరిగాయనే కారణంతనే వారిని తప్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కొత్త ఉద్యోగాల భర్తీ కోసమే..

కొత్త ఉద్యోగాల భర్తీ కోసమే..

ఈ నిర్ణయం పైన అనేక చర్చలు సాగుతున్నాయి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టుల్లో పదవీ విరమణ చేసిన వారిని కొనసాగించటం ద్వారా..కొత్త వారికి అవకాశాలు రావటం లేదని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. కొత్త ఉద్యోగాల భర్తీలో జరిగిన సమీక్షలో ఈ చర్చ జరిగింది. వీరిని ఈ నెలాఖరులోగా తొలిగించటం ద్వారా వాస్తవంగా అవసరమైన పోస్టులు ఎన్ని..భర్తీ చేయాల్సినవి ఎన్నీ అనే లెక్క మీద స్పష్టత రానుంది. దీని ద్వారా జనవరిలో చేపట్టాలని నిర్ణయించిన ఉద్యోగాల భర్తీలో వీటిని కొత్త వారితో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. గత ప్రభుత్వ హాయంలో అధికార పార్టీకి దగ్గరగా ఉన్న వారికి రిటైర్ అయినా..పలువురు కీలక పోస్టుల్లో కొనసాగే విధంగా నిర్ణయాలు జరిగాయి. వీటిని ప్రక్షాళన చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఎంత మంది పైన వేటు పడేదీ నెలాఖరు నాటికి స్పష్టత రానుంది.

English summary
AP govt decided to not continue retired employees services in future. Govt ordered all collectors to terminate thier sevices from govt. After that govt planning to give chance for new employment in those vacancies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X