బార్ల లైసెన్స్లు రద్దు: ప్రభుత్వం సడన్ షాక్: లాటరీ ద్వారా కొత్త విధానం..!
దశల వారీ మధ్య నిషేధంలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న అన్ని బార్ లైసెన్స్ లన్నీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల గడువుతో కొత్త లైసెన్సులు జారీ చేయాలని నిర్నయించింది. ఇక, లాటరీ విధానంలో కొత్త బార్లకు లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే, లైసెన్సు ఫీజును మాత్రం రూ 10 లక్షలుగా ఖరారు ేసింది. జనవరి 1 నుండి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. అదే విధంగా బార్ల సమయాలను సైతం కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వైఎస్ జగన్ బాటలో మరో ముఖ్యమంత్రి: ఏపీ తరహాలో అక్కడా దానిపై నిషేధం..!

బార్ల యజమానులకు షాక్..
ఏపీలో దశల వారీగా మధ్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నడుస్తున్న అన్ని బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 సంవత్సరానికి కొత్త బార్ల పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..అందులో భాగంగా జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త బార్ పాలసీ అమలు చేయాలని నిర్ణయించింది. మిగిలిపోయిన కాలానికి లైసెన్స్ ఫీజు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, కొత్త బార్లను మాత్రం లాటరీ పద్దితిలోనే ఖరారు చేయనున్నారు. నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

రెండేళ్ల గడువుతో కొత్త లైసెన్సులు
ప్రస్తుతం ఉన్న అన్ని బార్ లైసెన్స్ లన్నీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..రెండేళ్ల గడువుతో లెసెన్స్ లు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. లాటరీ విధానంలో కొత్త బార్లకు లైసెన్స్ ల మంజూరు
చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక, రూ.10 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఇప్పటికే మద్యం షాపులను భారీగా తగ్గించిన ప్రభుత్వం..ఏపీలోని బార్ల సంఖ్యను సైతం జనవరి నాటికి 40 శాతం మేర తగ్గించాలని నిర్ణయించింది. అదే సమయంలో బార్ల సమయాలను సైతం కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ బార్ల పనివేళలుగా ప్రభుత్వ ఖరారు చేసింది. రాత్రి 10 గంటల తరువాత 11 గంటల వరకు కేవలం ఫుడ్ ఆర్డర్లు మాత్రమే స్వీకరిస్తారు.

టీడీపీ వాళ్లవే బార్లు ఎక్కువ..
ముఖ్యమంత్రి బార్ల పాలసీ పైన సమీక్ష తరువాత డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో అధిక శాతం బార్లు టీడీపీకి చెందినవే అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బార్లు రద్దు చేసినా.. అవి ఎవరికి చెందినమైనా మిగిలిపోయిన కాలానికి లైసెన్స్ ఫీజు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో టీడీపీ నేతలు ఆసక్తి ఉంటే ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించే లాటరీ విధానంలో దరఖాస్తు చేసుకొని బార్లు దక్కించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల కారణంగా.. బార్ల లైసెన్సు ఫీజు రూ 10 లక్షలుగా ఖరారు చేయటం పైన అందరూ ఆలోచన చేస్తున్నారు. మరి..ప్రభుత్వ కొత్త బార్ల పాలసీకి ఏ రకంగా వ్యాపారుల నుండి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!