వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండలి రద్దు అంశంలో వెనక్కు పోం.. అప్పుడే పదవులు పోతాయి : తేల్చి చెప్పిన సజ్జల : నలుగురు ఎమ్మెల్సీల ఎమోషనల్..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ గతంలో జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్రానికి నివేదింది. మండలి కారణంగా ప్రయోజనం కలగటం లేదని..దాదాపు రూ 60 కోట్ల మేర ఖర్చు అవుతుందని నాటి తీర్మాన సమయంలో అధికార పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఆ తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది ఇదే అంశం పైన పార్టీ ఎంపీగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అమలు దిశగా శాసన మండలి రద్దు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఈ ఉదయం సీఎం జగన్ కు లేఖ రాసారు. ఇక, ఇప్పుడు మండలిలో టీడీపీ మెజార్టీ పోయి..పూర్తిగా వైసీపీ ఆధిపత్యం వచ్చింది. వరుసగా శాసనమండలిలో ఖాళీ అవుతున్న స్థానాల్లో వైసీపీ సభ్యులు నియమితులవుతున్నారు.

 మండలి రద్దుపైన తేల్చేసిన సజ్జల..

మండలి రద్దుపైన తేల్చేసిన సజ్జల..


ఈ సమయంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వాల్లో ముందుగా పదవులు ఇచ్చే వారి గురించి హైప్ క్రియేట్ చేయటం ఆ తరువాత నచ్చిన వారికి ఇవ్వటం పరిపాటిగా ఉండేదన్నారు. జగన్ సీఎం అయిన తరువాత అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్సీ పదవులతో పాటుగా నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ముగ్గురు మైనార్టీలు.. 12 మంది ఎస్సీ..బీసీ లకు అవకాశం ఇచ్చారని వివరించారు. ఇక, వైసీపీ తొలి ఎమ్మెల్సీ సైతం బీసీకే దక్కిందన్నారు. ఇదే సమయంలో మండలి రద్దు అంశం పైన స్పందించారు. జగన్ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు మండలి రద్దు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని సజ్జల స్పష్టం చేసారు. దాని నుండి వనక్కు పోవటం లేదని తేల్చి చెప్పారు.

కేంద్రం నిర్ణయం తీసుకుంటే..అమలవుతుంది

కేంద్రం నిర్ణయం తీసుకుంటే..అమలవుతుంది

కానీ, తాము కేంద్రం పైన ఒత్తిడి తేవటం..దాని గురించి పదే పదే ప్రశ్నించటం జరగదని కుండ బద్దలు కొట్టారు. అయితే, అప్పటి వరకు ఖాళీల భర్తీ తమ సభ్యులతో కొనసాగుతుందని చెప్పారు. కేంద్రం మండలి రద్దు నిర్ణయం తీసుకుంటే..అప్పుడు తమ సభ్యులంతా పదవులు కోల్పోతారంటూ చెప్పుకొచ్చారు. తాము దాని గురించి ఆలోచన చేయటం లేదన్నారు. టీడీపీ మెజార్టీ ఉండటంతో తెర చాటు వ్యవహారాలు.. కుట్ర లతో వ్యవహరించారని ఆరోపించారు. మూడు రాజధానుల బిల్లులు తిరిగి మండలిలో ప్రవేశ పెట్టాలా లేదే అనేది సమస్య కాదని... ఏది ఎలా జరగాలో అలా జరిగిపోతూనే ఉందంటూ చెప్పుకొచ్చారు.

నలుగురు సభ్యుల ప్రమాణం..భావోద్వేగం..

నలుగురు సభ్యుల ప్రమాణం..భావోద్వేగం..

తాజాగా.. గవర్నర్ కోటాలో నియమితులైన నలుగురు సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత వారు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మోషేన్ రాజు తాను ఎమ్మెల్సీ అవుతానని ఊహించలేదని..ముఖ్యమంత్రి కి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. మరో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తాను 2019 లో జగన్ ఛరిష్మా ముందు ఓడిపోయానని..తిరిగి ఇప్పుడు అదే జగన్ కారణంగా తనకు పదవి వచ్చిందన్నారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల ద్వారానే ఎప్పుడూ గెలుస్తూ వచ్చానని..తొలి సారి జగన్ ద్వారా చట్ట సభల్లో సభ్యుడినయ్యానని..తన సామాజిక వర్గానికి ప్రతినిధిగా పూర్తి న్యాయం చేస్తానంటూ భావోద్వేగానికి గురయ్యారు.

Recommended Video

#KodaliNaniPressMeet : లోకేష్ కాదు, బోకేష్, Jagan ని టచ్ కూడా చెయ్యలేరు || Oneindia Telugu
 జీవితాంతం జగన్ తోనే నడుస్తాం..

జీవితాంతం జగన్ తోనే నడుస్తాం..

ఇక, రమేష్ యాదవ్ సీఎం జగన్ పైన ప్రశంసలు కురిపించారు. కడప జిల్లాలో ఇప్పటి వరకు బీసీ వర్గానికి ఎమ్మెల్సీ దక్కలేదని..సీఎం జగన్ తొలి సారిగా తన ద్వారా బీసీ యాదవ వర్గానికి అవకాశం కల్పించారంటూ చెప్పుకొచ్చారు. ఇక, మరో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తనకు జగన్ దేవుడని చెప్పారు. తనకు ప్రతీ అవకాశం జగన్ కారణంగానే వచ్చిందని వివరించారు. జెండా పట్టిన వారికి జగన్ ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో..తమ ఎంపికే నిదర్శనమన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకూ జగన్ తోనే నడుస్తానని..వైసీపీతోనే కొనసాగుతానంటూ అప్పిరెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల రద్దు తీర్పు పైన ఎన్నికల సంఘం అప్పీల్ కు వెళ్లటం తో ఆ అంశం పైన స్పష్టత వచ్చిన తరువాత స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది స్థానాలు మండలిలో భర్తీ కానున్నాయి. అయితే, సజ్జల మండలి రద్దు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మండలి సభ్యుల్లో కొత్త చర్చ క కారణమయ్యాయి.

English summary
AP Govt advisor sajjala Ramakrishna reddy key comments on council abolishment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X