వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా మంత్రి పరిటాల సునీత కుమార్తె స్నేహలత వివాహం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అనంతపురం: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కుమార్తె డాక్టర్ పరిటాల స్నేహలత వివాహం ఘనంగా జరిగింది. అర్చకుల వేద మంత్రాల మధ్య వధువు మెడలో వరుడు శ్రీహర్ష తాళి కట్టారు.

అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, పలువురు మంత్రులు, టీడీపీనేతలు, కార్యకర్తలు, సినీనటులు, వ్యాపారవేత్తలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి రోజు ఏర్పాట్లను పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌ దగ్గరుండి పర్యవేక్షించారు.

 Grand Marriage Of Minister Paritala Sunithas Daughter Sneha Latha marriage

మంత్రి పరిాల సనీత కుమార్తె పరిటాల స్నేహలత, శ్రీహర్షల వివాహానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు హాజరవడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం రోడ్డు వెంబడి పోలీసులను నియమించారు. నలుగురు డీఎస్పీలు, 9 మంది సీఐలు, 25 మంది ఎస్‌ఐలు, 300 మందికి పైగా కానిస్టేబుళ్లు, 100 మందికి పైగా హోంగార్డులు, 2 స్పెషల్‌ పార్టీ, 2రోప్‌ పార్టీలు, పలువురు ఏఎస్‌ఐలు, బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమం ఏ అవాంతరం లేకుండా అంతా సక్రమంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Minister Paritala Sunitha's daughter Dr Sneha Latha's marriage with Dr Sri Harsha is take place grandly in Anantapur's Venkatapuram. Most of the TDP leaders such as Kalva Srinivasulu, Nannapaneni Rajakumari, other MLAs, MPs and ministers attended the grand wedding of Paritala Sneha Latha, to bless the couple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X